సినిమా తీస్తున్నారా.. పోర్న్ తీస్తున్నారా? హీరోయిన్ కు రోజూ డౌటే
ఆమె ఓ స్టార్ హీరోయినే.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిర్మాతలలో మంచి డిమాండ్ ఉంది. ప్రతీ సినిమా కథ విషయంలోనూ, ఇమేజ్ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేసేది. ఆమెకు తెలుసు ..ఓ సారి పొరపాటు చేస్తే అదే పెద్ద తప్పులా మారి కెరీర్ మొత్తం వెంటాడుతుందని. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని సార్లు తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. అలాంటిదే హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెస్సికా ఆల్బా కెరీర్ లోనూ జరిగింది. అంతా అర్దం అయ్యేసరికి సినిమా సగం అయ్యిపోయింది. ముందుకు వెళ్లలేదు. వెనక్కి వెళ్లలేదు. అసలేం జరిగింది? ఈ విషయాలపై ఈ మధ్యన
జెస్సికా ఆల్బాకి 2007 లో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కామెడీ సినిమా. హీరో ఎవరో తెలుసు. కథ ఏంటో తెలుసు. తన పాత్ర ఏంటో కూడా తెలుసు. పెద్దగా ఇబ్బందేమీ లేదనుకుంది. షూటింగ్‌కి వెళ్లింది. మొదటి రోజు కూడా ఏమీ అనిపించలేదు. రెండో రోజు కూడా ఓకే. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ఆమెకు సెట్ గురించి ఒక డౌట్ మొదలైంది. “అసలు అక్కడ సెట్లో సినిమా తీస్తున్నామా? లేక ఇంకేదైనా తీస్తున్నారా?”
అది చిన్న డౌట్‌గా మొదలై చివరికి ఆమెకు పెద్ద ఇబ్బందిగా మారింది. కారణం సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉండటమే కాదు. వాటిని చిత్రీకరిస్తున్న తీరు, సెట్లో ఏర్పడిన వాతావరణం ఆమెకు మరీ ఏం చేయాలో అర్దం కానట్లు అనిపించిందట. అందుకే ప్రతిరోజూ తన పని అయిపోయిందంటే చాలు… అక్కడ ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉండకుండా బయటకు వచ్చేసేదట.
మొదట చూస్తే ఇది ఒక మామూలు కామెడీనే…
వాస్తవానికి జెస్సికా ఆల్బా ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు, తన ముందున్నది ఒక బోల్డ్ కామెడీ అనే విషయం ఆమెకు తెలుసు. హీరో పాత్ర చుట్టూ తిరిగే కథలో మహిళలతో అతనికి ఏర్పడే సంబంధాలు కీలకం. అందుకే ఇలాంటి సీన్స్ సినిమాలో ఉంటాయని స్క్రిప్ట్ చదివినప్పుడే అర్థమయ్యే ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం స్క్రిప్ట్‌లో చదవడం వేరు… అదే విషయాన్ని రోజూ కెమెరా ముందు షూట్ చేయటం వేరు.
సినిమా కథేంటి
సినిమా కథ ప్రకారం హీరో ‘చక్’కి చిన్నప్పుడే ఒక విచిత్రమైన శాపం వస్తుంది. అతనితో శారీరక సంబంధం పెట్టుకున్న ప్రతి మహిళకు ఆ తర్వాత తన జీవిత భాగస్వామి దొరుకుతాడు. దాంతో హీరో జీవితంలోకి వరుసగా మహిళలు వస్తుంటారు. ఈ కాన్సెప్ట్ చుట్టూనే సినిమా కామెడీని నిర్మించారు.
కాగితంపై చూస్తే ఇదంతా ఒక ఫన్నీ కాన్సెప్ట్‌లా అనిపించొచ్చు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత అదే కాన్సెప్ట్ పదే పదే బోల్డ్ సన్నివేశాలుగా మారుతుంటే… నటీనటులకు ఆ అనుభవం ఎలా ఉంటుందన్నది అర్దం చేసుకోండి. అందుకే షూటింగ్ మొదలై రోజులు గడుస్తున్న కొద్దీ ఆల్బాకు ఏదో తేడాగా అనిపించింది
దాదాపు 30 రోజుల షూటింగ్ షెడ్యూల్. సినిమాలో హీరోకు ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో, సెట్లో కూడా వాటి చుట్టూనే చాలా పని సాగేది. జెస్సికా ఆల్బాకు మాత్రం ఈ వాతావరణం క్రమంగా ఇబ్బందిగా అనిపించడం మొదలైంది. అందుకే ఒక దశలో “ఇది పోర్న్లా ఉంది! ఇలా ఉంటుందని అనుకోలేదు.” అని చెప్పేసిందిట. ఈ ఒక్క మాటలోనే ఆమెకు ఆ సినిమా షూటింగ్ ఎలా అనిపించిందో అర్థమవుతుంది.
కానీ డబ్బులు తీసుకుని, ఎగ్రిమెంట్ చేసాక సినిమా షూటింగ్ సరిగ్గా లేదు వెళ్లిపోతాను అనటానికి లేదు. దాంతో రోజూ షూట్ కు వెళ్లేది. అయితే తన పార్ట్ అయ్యిపోగానే “నా పని అయిపోయిందా? అయితే నేను వెళ్లిపోతా…” అనేది. అలా ప్రొఫెషనల్‌గా తన పని పూర్తి చేసింది.
జెస్సికా చెప్పిన ప్రకారం, రోజూ తన పని అయిపోయిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేదట. చుట్టూ ఏం జరుగుతుందో చూసుకుంటూ కూర్చోవడం, షూటింగ్ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండటం… ఇవేవీ ఆమెకు అవసరం అనిపించేవి కావు.
“బై” చెప్పి బయటకు వెళ్లిపోవడమే.
ఆ సెట్ లో ఆమెకు ఒక స్పష్టమైన హద్దు ఉన్నట్టుగా అనిపిస్తుంది. తన పని తాను చేస్తోంది. తనను ఎవరూ అవమానించకపోతే పెద్దగా పట్టించుకోదు. కానీ పని అయిపోయిన తర్వాత మాత్రం అక్కడి వాతావరణంలో భాగంగా ఉండాల్సిన అవసరం తనకు లేదనుకుంది.
మరికొందరి విషయంలో ఆల్బాకు ఇంకో ఆందోళన
సెట్లో ఉన్న కొందరు మహిళా నటీమణులు తాము ఎంతవరకు నగ్నంగా కనిపించాల్సి వస్తుందో ముందే పూర్తిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చని ఆల్బా చెప్పింది. కొందరు ఇలాంటి సన్నివేశాలకు అలవాటుపడినవాళ్లు అయి ఉండొచ్చని కూడా ఆమె అనుమానించింది. అంటే ఆల్బా దృష్టిలో సమస్య కేవలం “నాకు ఈ సన్నివేశాలు నచ్చలేదు” అనే స్థాయిలో లేదు.
“సినిమా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అసలు తాము ఏం చేయబోతున్నామో స్పష్టంగా తెలుసా?” అనే డౌట్ కూడా ఆమెకు కలిగింది.
స్క్రిప్ట్‌లో రెండు పేజీలు… సెట్లో మాత్రం గంటల వ్యవహారం
స్క్రిప్ట్‌లో ఒక బోల్డ్ సన్నివేశం కొన్ని లైన్లలో అయిపోవచ్చు. కానీ కెమెరా ముందుకు వచ్చేసరికి అదే సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ చిత్రీకరించాలి. కెమెరా యాంగిల్స్ మారాలి. టేకులు చేయాలి. మధ్యలో ఆపాలి. మళ్లీ చేయాలి. అంటే నటుడికి అది కేవలం “ఒక సన్నివేశం” కాదు. దాని కోసం చాలా సమయం ఆ వాతావరణంలోనే ఉండాల్సి వస్తుంది.
జెస్సికా ఆల్బాకు బహుశా ఇదే తేడా బాగా అనిపించింది. స్క్రిప్ట్ చదివినప్పుడు ఒకలా కనిపించిన సినిమా… రోజూ సెట్‌కి వెళ్లి దాన్ని చిత్రీకరిస్తుంటే మరోలా కనిపించింది. స్క్రిప్ట్ ఒకటి చెబుతోంది. సెట్ ఇంకో అనుభూతిని ఇస్తోంది.
అయితే ఇది ఆమెకు ఎదురైన మొదటి ఇబ్బంది కూడా కాదు Good Luck Chuck కంటే ముందే Fantastic Four సమయంలో జెస్సికా ఆల్బా ఇలాంటి ఇబ్బింది కరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. ఆ సినిమాలో తాను చేసిన ఒక నగ్న సన్నివేశం గురించి తర్వాత ఆమె చాలా నెగిటివ్ గా మాట్లాడింది. అది తన కెరీర్లోనే అత్యంత చెత్త ఎక్సపీరియన్స్ లో ఒకటిగా ఆమె భావించింది. అందుకే అప్పటి నుంచీ తన కెరీర్ గురించి ఆమె కాస్త ఆగి ఆలోచించడం మొదలుపెట్టానంటోంది.








