డేటా సెంటర్ల ఏర్పాటుతో ఎన్ని లాభాలున్నాయో .. అన్ని అనర్థాలు కూడా : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఐటీ సంస్థల (IT companys) ఆసక్తి చూపుతున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. టైర్-2 సిటీల్లోని ఐటీ టవర్లలో సంస్థల ఏర్పాటుకు ముందుకు రావట్లేదు. జిల్లాలోని ఐటీ టవర్ల సమీపంలో మౌలిక వసతులపై ఆలోచిస్తున్నారు. ఈ ఏడాదిలో 65 జీసీసీలు తీసుకొచ్చాం. 85 శాతం రెంటల్ స్పేసెస్ జీసీసీలతో నిండిపోయింది. జీసీసీల రాకతో రెండేళ్లలో లక్ష కొత్త ఉద్యోగాలు రానున్నాయి. కొత్త జీసీసీ (GCC) పాలసీ తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. డేటా సెంటర్ల (Data centers) ఏర్పాటుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. డేటా సెంటర్ల ఏర్పాటుతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. ఏఐ వచ్చిన తర్వాత ఉపాధి కల్పన తక్కువగా ఉంది అని అన్నారు.








