నిజం గెలిచింది.. 2024 చారిత్రక ప్రజాతీర్పు
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా..”నిజం గెలిచింది” అంటూ మంత్రి నారా లోకేష్ గారి పిలుపు నందుకొని.. 2023 లో తెలుగుదేశంపార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో, నాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు జరిగి నేటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, అభిమానులు ఆనాటి దుశ్చర్యను మరోసారి గుర్తుచేసుకుంటూ కక్షపూరిత, అప్రజాస్వామిక పాలన విధానాన్ని ఖండించారు. కొవ్వొత్తులతో చంద్రబాబు గారికి మద్దతు తెలియజేస్తూ, అధికారం, పదవులకతీతంగా భారతదేశ రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్య పాలనా స్ఫూర్తిని పాటిద్దామని పిలుపునిచ్చారు. అన్న ఎన్టీఆర్ కు నివాళి అర్పించి, ఈ కార్యక్రమాన్ని మాగులూరి భానుప్రకాష్ సమన్వయ పరచారు.
ఇవి కూడా చదవండి
భాను ప్రకాష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో, చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి, అప్రజాస్వామికంగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్టు చేసి, 53 రోజుల పాటు రిమాండ్ ఎదుర్కొన్నా, వారి పోరాట స్ఫూర్తిని, ప్రజాస్వామ్యంపట్ల విశ్వాసాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయారు. 53 రోజులపాటు జైల్లో ఉన్న చంద్రబాబు కోసం, ప్రవాస భారతీయ తెలుగు జాతి “నిజం గెలవాలి” అంటూ మద్దతుగా నిలిచిందని పలువురు గుర్తుచేశారు. పలువురు ప్రవాస పెద్దలు మాట్లాడుతూ గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడేందుకు కలిసి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు, బీజేపీ పార్టీ పెద్దలకు అభినందనలు తెలుపుతూ, కూటమి ఐక్యత ఇకముందూ కొనసాగాలని, దేశం,తెలుగు రాష్ట్రాల ప్రగతి సమర్ధ నాయకత్వంలో ఇకముందూ సర్వతోముఖాభివృద్ధి చెందాలని తెలిపారు.









