ఆ పదవి ఇస్తానని హైకమాండ్ మాటిచ్చింది : రాజగోపాల్రెడ్డి
నిధుల కోసం సీఎం రేవంత్ (CM Revanth) ను కలిస్తే తప్పేంటని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే సీఎం, డిప్యూటీ సీఎం (Deputy CM)ను కలవాల్సిందేనని చెప్పారు. సీఎంతో తనకు అభిప్రాయబేధాలు మాత్రమే ఉన్నాయన్నారు. మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు అని చెప్పడం తన నైజమన్నారు. సీఎం రేవంత్, నేను ఎప్పుడూ తిట్టుకోవాలని కొందరు చూస్తున్నారు. మంత్రి పదవి కోసం సీఎం దగ్గర రాజీపడినట్లు ప్రచారం చేస్తున్నారు. మంత్రి పదవి (Minister post) ఇచ్చేది అధిష్ఠానం. ఆ పదవి ఇస్తానని హైకమాండ్ మాటిచ్చింది. అధిష్ఠానం ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. సీఎంను కలిస్తే కాంప్రమైజ్, కలవకపోతే గ్యాప్ పెరిగిందని ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. కొండా సురేఖ (Konda Surekha) విషయంలో అధిష్ఠానానికి సీఎం రేవంత్ చెప్పడంలో తప్పేమీ లేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే రూ.ఐదు లక్షలు చిన్నమొత్తమేమీ కాదు అని అన్నారు.







