ఆ రెండు పార్టీలు సభలో అలజడి సృష్టిస్తున్నాయి : ఆది శ్రీనివాస్
బయట బీఆర్ఎస్ (BRS), సభ లోపల బీజేపీ గందరగోళం సృష్టిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రెండు పార్టీలు సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారాలు కనుగొనాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, రెండు పార్టీలు కుయుక్తులు పన్ని సభలో అలజడి సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 3 రోజులు వృథా ప్రజా సమస్యలు కంటే ఫక్తు రాజకీయాలు చేసే యత్నం మానుకోవాలి. స్పీకర్‌పై జరిగిన అవమానంపై చర్చ జరపాలంటే బీఆర్ఎస్ చర్చించదు. 22ఏపై చర్చ జరపాలంటూ సభలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ( BJP) యత్నిస్తోంది. ప్రతి ప్రజా సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు.








