రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలందరూ భాగస్వాములు కావాలి: శ్రీ కొండపల్లి శ్రీనివాస్, ఎన్నారై వ్యవహారాల మంత్రి
ఇండీయాలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మనందరినీ కేవలం తమిళియన్స్ గా గుర్తించిన రోజుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు తెలుగు దేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఆంధ్ర ప్రదేశ్ ను తెలుగు రాష్ట్రంగా గుర్తించేలా చేశారని రాష్ట్ర ఎన్నారైల వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన ప్రారంభించిన తెలుగుదేశం పార్టీకి దేశంలోనూ, ప్రపంచంలోనూ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజనరీ లీడర్ శ్రీ చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి నలభై ఏళ్ల ముందు చూపుతో ప్రణాళికలు వేసి, అనేక అభివృద్ధి పథకాలు తీసుకువచ్చి, తెలుగు రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చెందటం, నవ్యాంధ్రప్రదేశ్ మళ్ళీ శ్రీ చంద్రబాబుగారి సారథ్యంలో తన ప్రయాణం మొదలెట్టింది. ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన భాగస్వాములు మన ఎన్నారైలు. నేను కూడా ఒక ఎన్నారైగా అమెరికాలో ఉంటూ, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. నన్ను గుర్తించి, నాకు మంత్రి పదవి కూడా ఇచ్చి, ఒక బాధ్యత అప్పజెప్పారు.
మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ ఒక పక్క పార్టీలో కీలక బాధ్యత తీసుకుని, సామాన్య ప్రజల దగ్గర నుంచి పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా కలుస్తూ వారిని ఉత్తేజపరుస్తూ ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని రాష్ట్రాభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆర్థికంగా ఎంతో నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని మరలా పునరుద్ధరించే దశలో భాగంగా ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పథకాలను సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు దశా నిర్దేశం చేస్తుండగా, యువనాయకుడు శ్రీ నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశలో ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రం కష్ట సమయంలో ఉండగా, ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన సేవ ఎవరు మర్చిపోలేరు. నేను పోటీ చేసిన నియోజకవర్గంలోనే నాకు ఏ మాత్రం పరిచయం లేని ఒకరిద్దరు ఎన్నారైలు వచ్చి, వారి గ్రామాల్లో పనిచేసి నా గెలుపుకు సాయపడ్డారు. అలాంటి ఎన్నారైల సేవలలకు గుర్తింపుగా మన ప్రభుత్వం, మన తెలుగుదేశం పార్టీ గ్లోబల్ ఎన్నారై టీడిపి (Global NRI TDP) కమిటీ ఏర్పాటు చేయటం, దానికి రాష్ట్రానికి గత 20 ఏళ్లుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక సేవలు చేస్తున్న డా. గురు రాజాను ప్రెసిడెంట్ గా , గత 12 సంవత్సరాలుగా రాష్ట్రానికి, పార్టీలు కి ఏంటో సేవ చేస్తున్న ఎన్నారైలను వివిధ పదవులలో నియమించి ఏర్పాటు చేసిన గ్లోబల్ కమిటీ ఇది. ఈ కమిటీ సభ్యులు అందరూ రాష్ట్రాభివృద్ధి కి తోడ్పడుతారని ఆశిస్తున్నాను. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీ అందరూ మీ మీ దేశాల నుంచి వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం చాలా సంతోషంగా ఉన్నది.











