2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎన్నారై కమ్యూనిటీ పనిచేయాలి… ఉత్తర అమెరికా ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏ రకంగా చూసుకున్నా గాని, ఏ పొలిటికల్ పార్టీ కూడా మన టీడీపీకి సాటి కాదు. అలానే ప్రతి ఎలక్షన్లలో, పార్టీ విజయాల్లో పార్టీకి తోడుగా ఉన్న ఎన్నారై టీడిపి సభ్యులకు కూడా ఎవరు సాటి రారని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరాంకోమటి అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఎనఆరఐ టీడీపీ పార్టీ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని మరింత పటిష్టం చేయడంలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. విదేశాల్లో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడంతో పాటు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరువ చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో గ్లోబల్ ఎన్నారై టీడిపీ అధ్యక్షులు డా. గురు రాజా డైరెక్షన్ మేరకు, పార్టీ నాయకుల డైరెక్షన్ మేరకు, మేమందరం కూడా కలిసి పనిచేసి, తెలుగుదేశం పార్టీని భావి తరాలకి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయటం మా అందరి బాధ్యత అని చెప్పారు. ఇంతవరకు మనం అమరావతి రైతుల ఆందోళన లేదా బాబు గారి అరెస్ట్ సమయం లాంటి అనేక విషయాలలో మనమంతా కలిసికట్టుగా బయటికి వచ్చాము..అదే స్ఫూర్తితో, నిస్వార్థంగా మున్ముందు కూడా మనందరం పని చేయాలి. ఈరోజు నలభై ఐదు మంది సభ్యులతో కమిటీ అయితే, ప్రమాణ స్వీకారానికి కూడా నలభై ఐదు మంది వచ్చారు. అది ఎన్నారై నిబద్దత. నా విషయానికి వస్తే కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మా ఫాదర్ ఉన్న సమయంలోనే , చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు ఆయన లీడర్షిప్ కి ప్రభావితం అయి, పార్టీ లో చేరి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీతో నడిచాను. నేనే కాదు, తెలుగుదేశం పార్టీ లో చేరిన ప్రతి ఎన్నారై కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు.ఈ రోజు అమెరికాలో ఉన్నా, ఎక్కడ వున్నా ఎన్నారైలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా భావించవచ్చు. అలాగే ఎన్నారైలు అందరూ మరింత శ్రద్ధగా, మరింత బాధ్యతతో పార్టీని మీ ప్రాంతాల్లో పటిష్టం చేసి 2029 ఎన్నికలలో విజయం సాధించే దిశగా పని చేయాలి.” అని చెప్పారు. శ్రీ జయరాజం కోమటి ఎన్నారైలలో ఒకడిగా మాట్లాడుతూ సూచనలు ఇవ్వడం అందరిని ఆకర్షించింది.









