రొమాంటిక్ కామెడీ ‘అన్బే డయానా’ OTT మూవీ రివ్యూ
Rating: 2.5
–సూర్య ప్రకాష్ జోశ్యుల
మిడిల్ క్లాస్ కుర్రాడు సీతాకృష్ణ (పరి ఎలవళగన్)గత కొంతకాలంగా అంటే సినిమా ప్రారంభం అయ్యేసరికే ‘మ్యాజిక్’ (రమ్య రంగనాథన్)తో ప్రేమలో ఉంటాడు. అయితే ఆమె సగటు తమిళ అమ్మాయి కాదు. ఓ ఆంగ్లో ఇండియన్. దాంతో ఆమె కుటుంబ పద్దతులు వేరు. ఆమె జీవితం కూడా వేరు అన్నట్లుగా ఉంటుంది. అయితే మనవాడు పట్టువదలని ప్రేమ మార్కుడు. ఆమె వెనకాలే పడి..ఆమె తమ్ముడుకి స్పోర్ట్స్ లో తన దగ్గరే కోచింగ్ ఇచ్చి మరీ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూంటాడు.
ఇక ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆమె ఒప్పుకున్నా తన ఇంట్రో తన తల్లి తల్లి సరళ (రోజా) ని ఒప్పించటం కష్టమనే విషయం సీతాకృష్ణకు తెలుసు.ఎందుకంటే సరళ స్కూలే వేరు. ఆవిడ ఓ పిండిమర నడుపుతూ కుటుంబాన్ని ఒంటి చేత్తో లాగుతుంది. భర్త ఉద్యోగం చేస్తున్నా ఆ డబ్బులు ఇంటికి రావు అని తెలిసే ఈ పిండిమిల్లు పెట్టుకుంది. అలాగే ఆమెకు కొన్ని రూల్స్ ఉన్నాయి.తన కులం, తన మతం దాటి వెళ్ళటానికి ఇష్టపడదు. కాబట్టి ఆంగ్లో ఇండియన్ ని తన కోడలు గా ఒప్పుకోవటం కష్టమే.
అయినా ఎవరి నమ్మకాలు, భ్రమలు వారికుంటాయి కదా. అలాగే సీతాకృష్ణకు కూడా తన తల్లిని ఒప్పించగలననే నమ్మకం. ఈలోగా ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా అనుకుంటాడు. దాంతో తన తల్లికి ఈ విషయాలు ఏమీ చెప్పడు. ఈలోగా ఆ తల్లి తన కొడుక్కి తన తమ్ముడు కూతురు ‘తనీషా’తో పెళ్లి మాటలు మాట్లాడేస్తుంది. తన కొడుకు తన మాట జవదాడటమే పిచ్చి నమ్మకంతో. ఇలా ఎవరి వెర్షన్స్ వాళ్లు వేసుకుని కథను ముందుకు నడుపుతూంటారు. ఈలోగా మ్యాజిక్ కు మన హీరోపై ప్రేమ పుడుతుంది. అదే సమయంలో కృష్ణలో కొన్ని సందేహాలు మొదలవుతాయి. మ్యాజిక్ అందంగా ఉంది కాబట్టి ప్రేమించాడు. కానీ ఆమె స్వేచ్ఛగా ఉన్నదున్నట్లు మాట్లాడుతోంది, హగ్ చేసుకుంటోంది, చిన్న డ్రెస్సులు వేసుకుంటోంది, అప్పుడప్పుడు డ్రింక్ చేయడం వీటిన్నటితో తన కుటుంబంలో ఆమె ఇమడగలదా అనే సందేహం వస్తుంది.
ఓ ప్రక్కన ప్రేమించిన అమ్మాయి తన కుటుంబంలో ఇమడగలదా అనే సందేహం, మరో ప్రక్క ఆమెను తన తన తల్లి ఏక్సెప్టు చేస్తుందా..ఏమంటుందనే భయం.అలాగే తనను ఆంగ్లో ఇండియన్ కుటుంబం అల్లుడుగా ఓకే చేస్తుందా అనే డౌట్. వీటిన్నటి మధ్యా ఊగిసలాటలో శీతాకృష్ణ ఏం చేస్తాడు. తల్లిని ఒప్పిస్తాడా. అలాగే మ్యాజిక్ తల్లి,తండ్రులను ఒప్పించగలుగుతాడా…తన మామయ్య కూతురు సంగతి ఏం చేస్తాడు..ఫైనల్ గా ఏం అవుతుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కథగా చూస్తే పెద్ద చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కాకపోతే కథనంతోటే మ్యాజిక్ చెయ్యాలనుకున్నాడు దర్శకుడు. Anbe Diana స్క్రీన్‌ప్లేను లోపలకి వెళ్లి చూస్తే, ఇది సాధారణంగా కనిపించే “వేర్వేరు సంస్కృతులకు చెందిన ఇద్దరి ప్రేమకథ” కాదు. అసలు కథలో ఉన్న కోర్ కాన్ఫ్లిక్ట్ వేరే. హీరో ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ ప్రేమకు బాధ్యత వహించడానికి సిద్ధంగా లేడు అనేదే. అంటే సినిమా ఇంటర్నెల్ కాంప్లిక్ట్ బాగానే సెట్ చేసారు. కానీ ఈ కాంప్లిక్ట్స్ వచ్చే పరిణామాలు లేవు.
ఎందుకంటే హీరో ఏ నిర్ణయం తీసుకోడు. ప్యాసివ్ గా చూస్తూంటాడు. కథ ఎటు వెళ్తే అటు వెళ్దామన్నట్లుగా ఉండిపోతాడు. దాంతో పెద్దగా చెప్పుకోదగ్గ సంఘటనలు కథలో చోటు చేసుకోవు. దాంతో ఎంతసేపు పాత్రలు, వాటితో వచ్చే సీన్స్ తెరపై వచ్చిపోతూంటాయి. అంతేకానీ మనం ప్రధాన పాత్ర కృష్ణతో ప్రయాణం చేయలేదు. అంటే స్క్రీన్‌ప్లేలో “Set-up” ఉంది… కానీ “Pay-off” రావడం లేదు. అయితే ఉన్నంతలో కామెడీ బాగా పండింది. అదే సినిమాని చివరి దాకా చూడగలిగేలా చేసింది.
టెక్నికల్ గా ..
టెక్నికల్‌గా Anbe Diana నీట్‌గా రూపొందిన సినిమా. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సెకండ్ హాఫ్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ పాయింట్లు. అయితే బలమైన టెక్నికల్ ఎగ్జిక్యూషన్ ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే, స్టోరీ టోన్‌లో ఉన్న ఇబ్బందులను అవి పూర్తిగా కవర్ చేయలేకపోయాయి.ఇక దర్శకుడుగా పరి ఎళవళగన్ కథకు మంచి సెటప్ ఎంచుకున్నాడు. పెరంబూర్ నేపథ్యం, విభిన్న సంస్కృతుల మధ్య ప్రేమకథ ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే కథలో ఉన్న సీరియస్ అంశాలను, కామెడీని బ్యాలెన్స్ చేయడంలో కొంత తడబడినట్టు అనిపిస్తుంది.
ఫైనల్ థాట్
మొత్తానికి, Anbe Dianaలో ప్రేమ ఉంది… కామెడీ ఉంది… కల్చరల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. అయితే వీటన్నింటినీ కలిపి మన మనస్సులో నిలిచిపోయే ప్రేమకథగా మార్చే స్క్రీన్‌ప్లే మాత్రం లేదు. ప్రేమ కోసం భయపడే హీరో కథను చెప్పాలనుకుంది. కానీ చివరికి హీరో భయాన్ని నవ్వుల వెనక దాచేసింది. మంచి ఐడియాతో మొదలైన Anbe Diana… చివరికి మంచి సినిమా కావడానికి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయింది.
చూడచ్చా
ఒక లైట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చూద్దామనుకునేవాళ్లకు మంచి ఆప్షన్.
ఎక్కడ చూడచ్చు?
‘సోనీ లివ్’ లో తెలుగులో ఉంది.








