ఎలాన్ మస్క్ కొడుకు పేరులో ‘శేఖర్’… ఆ పేరు వెనుక ఉన్న భారతీయ మహా శాస్త్రవేత్త ఎవరు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎలాన్ మస్క్ పిల్లల పేర్లు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తూనే ఉంటాయి. కొన్ని పేర్లు వినగానే వాటిని ఎలా పలకాలో కూడా అర్థం కానంత విచిత్రంగా ఉంటాయి. కానీ ఆయన పిల్లల్లో ఒకరి పేరులో మాత్రం మనకు బాగా పరిచయమైన భారతీయ పేరు కనిపిస్తుంది.
Strider Sekhar.
అవును… ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ టెక్ బిలియనీర్లలో ఒకరైన ఎలాన్ మస్క్ తన కొడుకు పేరులో ‘Sekhar’ ను ఎందుకు చేర్చాడు?
ఆ ‘Sekhar’ పేరు వెనుక ఉన్నది ఎలాన్ మస్క్‌కు తెలిసిన ఏ భారతీయ స్నేహితుడు కాదు. కుటుంబ సభ్యుడు కాదు. మరి ఎవరు ఆయన
ఆ పేరు వెనుక ఉన్నది… నక్షత్రాల పుట్టుక, ఎదుగుదల, మరణం గురించి ప్రపంచం ఆలోచించే విధానాన్నే మార్చేసిన భారతీయ మూలాలున్న ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయనే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్.
‘Strider’ ఒక వైపు… ‘Sekhar’ మరో వైపు
మస్క్ తన కొడుకు పేరు వెనుక ఉన్న కారణాన్ని స్వయంగా వివరించారు. Strider అనే పేరు The Lord of the Ringsలోని Aragorn పాత్ర నుంచి వచ్చింది. కానీ Sekhar? అది గొప్ప భారతీయ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు నుంచి వచ్చింది.
అంతే కాదు, మస్క్ ఆయనను ప్రత్యేకంగా “great Indian physicist Chandrasekhar” అని కూడా పేర్కొన్నారు. అంటే ఎలాన్ మస్క్ కొడుకు పేరులోకి ‘శేఖర్’ ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. అసలు చంద్రశేఖర్ ఏం చేశారు? ఆయన పేరు ఎలాన్ మస్క్ వంటి వ్యక్తి గుర్తుపెట్టుకునేంత గొప్పదా?
చంద్రశేఖర్ ఏం చేశారు?
సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1910లో లాహోర్‌లో జన్మించారు. అప్పట్లో అది బ్రిటిష్ ఇండియాలో భాగం. ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది. ఆయన పెరిగింది, చదువుకున్నది మాత్రం మద్రాస్‌లోనే. చిన్నప్పటి నుంచే గణితం, భౌతిక శాస్త్రం అంటే ఆయనకు విపరీతమైన ఆసక్తి. ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ మేటర్ ఉంది. భారతదేశంలో తొలి నోబెల్ బహుమతి తీసుకొచ్చిన సి.వి. రామన్ ఆయనకు బంధువు.
కానీ చంద్రశేఖర్ తన గుర్తింపును కుటుంబం వల్ల సంపాదించలేదు. తనదైన ఒక ప్రపంచాన్ని ఎంచుకుని ముందుకు వెళ్లటంలో వచ్చింది.
ఆ ప్రపంచం… మన తలపై రాత్రిపూట మెరుస్తూ కనిపించే నక్షత్రాలు. ఆయన కు వచ్చిన ఆలోచన…మనకు అందంగా కనిపించే నక్షత్రాలు కూడా చనిపోతాయా? రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు ఎప్పటినుంచో అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి వాటికీ మనుషుల్లాగే ఒక జీవితం ఉంటుంది. పుడతాయి. పెరుగుతాయి. తమలోని ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి. చివరికి ఒక రోజు తమ ప్రయాణాన్ని ముగిస్తాయి.
చంద్రశేఖర్‌ను వెంటాడిన ప్రశ్న ఒక్కటే.
నక్షత్రం చనిపోయిన తర్వాత ఏమవుతుంది? అది చిన్న ప్రశ్నలా వినిపించవచ్చు. కానీ దానికి సమాధానం కనుక్కోవడం అంత సులువు కాదు. అప్పటికి చంద్రశేఖర్ చాలా చిన్న వయసులో ఉన్నారు. అయినా నక్షత్రాల చివరి దశపై లెక్కలు వేయడం మొదలుపెట్టారు. ఆ లెక్కల నుంచే ప్రపంచ శాస్త్రంలో ఒక పెద్ద సిద్ధాంతం బయటకు వచ్చింది. అదే ‘చంద్రశేఖర్ లిమిట్’.
‘చంద్రశేఖర్ లిమిట్’ అంటే ఏంటి?
సింపుల్‌గా చెప్పాలంటే…ఒక నక్షత్రం తన జీవిత చివరి దశకు చేరుకున్నప్పుడు అది ఎంత బరువు ఉందన్నదే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొన్ని నక్షత్రాలు కుంచించుకుపోయి White Dwarf అనే రూపంలో మిగిలిపోతాయి. అయితే ఇక్కడే చంద్రశేఖర్ ఒక కీలకమైన విషయం చెప్పారు. ఒక నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ బరువు ఉన్న నక్షత్రం మాత్రం White Dwarfగా నిలబడలేదు.
అంటే? అది మరింత కుంచించుకుపోతుంది. కొన్ని పరిస్థితుల్లో Neutron Starగా మారవచ్చు. లేదా మరింత తీవ్రమైన పరిస్థితుల్లో Black Hole ఏర్పడే దిశగా వెళ్లవచ్చు. ఒక నక్షత్రం ఎంత వరకు తనను తాను నిలబెట్టుకోగలదో చెప్పే ఆ కీలక పరిమితినే ప్రపంచం తరువాత… Chandrasekhar Limit అని పిలిచింది.ఇది మామూలు విషయం కాదు.
నక్షత్రాలు చివరికి ఎలా ముగుస్తాయి? Black Holes ఎలా ఏర్పడతాయి? విశ్వంలో భారీ నక్షత్రాలకు చివరికి ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే శాస్త్రవేత్తలకు చంద్రశేఖర్ పరిశోధన ఒక ముఖ్యమైన పునాదిగా నిలిచింది.
మొదట ఆయన మాట ఎవరూ నమ్మలేదు!
ఇక్కడే చంద్రశేఖర్ కథ కాస్త సినిమాటిక్‌గా మారుతుంది. ఒక యువ శాస్త్రవేత్త. వయసు చాలా తక్కువ. ప్రపంచం గుర్తించిన పెద్ద పెద్ద శాస్త్రవేత్తల మధ్య తన పరిశోధనను తీసుకెళ్లాడు. కానీ అందరూ చప్పట్లు కొట్టలేదు. ఆయన సిద్ధాంతాన్ని అప్పటి కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు అంగీకరించలేదు. తీవ్రంగా వ్యతిరేకించినవాళ్లు కూడా ఉన్నారు.
అయినా తన లెక్కలపై చంద్రశేఖర్ నమ్మకం పెట్టుకున్నారు. పరిశోధన కొనసాగించారు. కాలం గడిచింది. చివరికి ఆయన చెప్పిందే సరైందని ప్రపంచానికి అర్థమైంది. ఒకప్పుడు వ్యతిరేకత ఎదుర్కొన్న ఆ సిద్ధాంతమే తరువాత ఖగోళ భౌతిక శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతాల్లో ఒకటిగా నిలిచింది.
అయితే ఆయన జీవితం మొత్తం దానికే పరిమితం కాలేదు. ఒక శాస్త్రీయ సమస్యను లోతుగా అధ్యయనం చేయడం పూర్తయిందనుకున్న తర్వాత ఆయన ఇంకో కష్టమైన సమస్యను ఎంచుకునేవారు. నక్షత్రాల నిర్మాణం నుంచి వాటి కదలికల వరకు… కాంతి ప్రయాణం నుంచి ద్రవాల ప్రవర్తన వరకు…సాపేక్ష సిద్ధాంతం నుంచి Black Holes వరకు…అనేక రంగాల్లో ఆయన పనిచేశారు. అంటే చంద్రశేఖర్ ఒకే విషయాన్ని పట్టుకుని జీవితాంతం కూర్చున్న శాస్త్రవేత్త కాదు. విశ్వం అడిగే ఒక్కో కఠినమైన ప్రశ్నను ఎంచుకుని, దానికి సమాధానం వెతికిన వ్యక్తి.
చివరికి నోబెల్ వచ్చింది
చంద్రశేఖర్ చేసిన పరిశోధనలకు ప్రపంచ స్థాయిలో వచ్చిన అతిపెద్ద గుర్తింపు 1983లో వచ్చింది. ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నక్షత్రాల నిర్మాణం, వాటి పరిణామంలో జరిగే భౌతిక ప్రక్రియలపై చేసిన పరిశోధనలకు ఈ గౌరవం దక్కింది.
ఇక చంద్రశేఖర్ ప్రభావం ఎంత వరకు వెళ్లిందంటే…NASA నిర్వహిస్తున్న ప్రసిద్ధ Chandra X-ray Observatoryకి కూడా ఆయన పేరే పెట్టారు. విశ్వంలో జరిగే అత్యంత తీవ్రమైన ఖగోళ సంఘటనలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రం… ఒక భారతీయ శాస్త్రవేత్త పేరుతో ఉంది.
ఆయన నక్షత్రాలను అధ్యయనం చేశారు. ఆయన పేరుతో ఉన్న పరిశోధనా కేంద్రం ఇప్పుడు అంతరిక్షాన్ని పరిశీలిస్తోంది. దానికంటే మంచి గౌరవం ఇంకేం ఉంటుంది? అందుకే ఎలాన్ మస్క్ కొడుకు పేరులో ‘శేఖర్’








