చార్లెట్ వేదికగా అట్టహాసంగా టీటీఏ మెగా కన్వెన్షన్.. సందడిగా మొదలైన తొలి రోజు వేడుకలు
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలోని కన్వెన్షన్ సెంటర్లో ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TTA) మెగా కన్వెన్షన్‌కు సర్వం సిద్ధమైంది. చార్లెట్ నగరంలో ఒక తెలుగు సంఘం ఇంతటి స్థాయిలో కన్వెన్షన్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జూలై 17, శుక్రవారం నుండి జూలై 19, ఆదివారం వరకు ఈ మూడు రోజుల పండుగను అద్భుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఏర్పాట్లు , అతిథ్య నిర్వహణ:
గత 10 రోజులుగా టీటీఏ పెద్దలు చార్లెట్లో మకాం వేసి, ప్రతి పనిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
అతిథుల కోసం ఎయిర్పోర్ట్ పికప్, హోటల్ రిజర్వేషన్లు వంటి ఆతిథ్య కార్యక్రమాలను ఎక్కడా లోటు లేకుండా చాలా పక్కాగా నిర్వహిస్తున్నారు.
ఈ కన్వెన్షన్ నిర్వహణలో టీటీఏ అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింతా, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి , శేఖర్ రెడ్డిలు కీలకం.
కార్యక్రమాల వివరాలు:
శుక్రవారం బాంక్వెట్ డిన్నర్‌తో ప్రారంభమయ్యాయి. శనివారం , ఆదివారం విభిన్న కార్యక్రమాలతో చార్లెట్ నగరాన్ని తెలుగు కళా వైభవంతో నింపనున్నాయి. కన్వెన్షన్‌లో భాగంగా నిర్వహించే ప్రధానాంశాలు ఇవే:
మాట్రిమోనియాల్, విమెన్స్ ఫోరమ్, CME, బిజినెస్, పొలిటికల్ , నెట్వర్కింగ్ సెమినార్లు.
ఇండియా పెరేడ్, యువత ప్రోగ్రామ్స్, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు.
షాపింగ్ బూత్స్, సెలెబ్రిటీ మీట్ అండ్ గ్రీట్, ఫొటో బూత్స్.
బ్యూటీ పాజంట్ ఫైనల్స్, TTA స్టార్ ఫైనల్స్, శ్రీ శ్రీనివాస కల్యాణం.
అవార్డ్స్ ప్రజంటేషన్, కల్చరల్ ప్రోగ్రామ్స్, యూత్ బాంక్వెట్, లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ నటులు, రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు , ప్రముఖులు ఈ వేడుకలకు తరలివచ్చారు. ‘జస్ట్ ఎంబ్రేస్ ఇట్ ఇన్ చార్లెట్’ అనే నినాదంతో సాగుతున్న ఈ వేడుకలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయడం అభినందనీయం.








