తానా విశ్వ గురుకులం ఆధ్వర్యంలో రామాయణ నైతిక విలువల తరగతులు..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) విశ్వ గురుకులం ఆధ్వర్యంలో పిల్లల కోసం ‘రామాయణ నైతిక విలువల తరగతులు’ (Classes on Ethical Values from Ramayana) ప్రారంభించనున్నారు. రామాయణం ద్వారా జీవితానికి అవసరమైన నైతిక విలువలు, కుటుంబ బంధాలు, క్రమశిక్షణ, గౌరవం, ధర్మం , భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.
తరగతుల ముఖ్య ఉద్దేశం, విశేషాలు:
పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడం.
భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని పరిరక్షించడం.
కుటుంబ విలువలు , వ్యక్తిత్వ వికాసానికి పెద్దపీట వేయడం.
భావితరాలకు మన ప్రాచీన జ్ఞాన సంపదను అందించడం.
అన్ని వయస్సుల వారి కోసం ఏర్పాటు చేసిన ఈ తరగతులు బుధ, గురు, శని , ఆదివారాల్లో ప్రారంభమవుతాయి.
నమోదు వివరాలు:
రిజిస్ట్రేషన్ లింక్: https://events.tana.org/event/viswa-gurukulam-2026
ఈమెయిల్: [email protected]
“రామాయణం మన సంస్కృతికి మూలస్తంభం… భావితరాలకు అందిద్దాం” అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ఈ విలువైన కార్యక్రమాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకొని మరిన్ని పిల్లలకు ఈ అవకాశాన్ని అందించాలని తానా కోరింది.
నిర్వాహక వర్గం:
డా. నరేన్ కొడాలి (President)
శ్రీనివాస్ లావు (EVP)
రాజని మరం (More info)








