19వ ఆటా మహాసభలు.. ముఖ్య అతిథులుగా మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ , భట్టి విక్రమార్క
ATA: అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు జరగనున్న 19వ అమెరికన్ తెలుగు సంఘం (ATA) కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక మహాసభలకు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.
అతిథులుగా విచ్చేసేది వీరే..
మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ (The Honorable Wes Moore) ఈ మహాసభలకు కీనోట్ స్పీకర్గా (Keynote Speaker) హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా (Chief Guest) విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అమెరికాలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు అందించేలా , తెలుగు కీర్తిని ఇనుమడింపజేసేలా నిర్వహిస్తున్న ఈ మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.








