టీం వర్క్‌తోనే టీటీఏ మెగా కన్వెన్షన్ గ్రాండ్ సక్సెస్: డా. పైళ్ల మల్లారెడ్డి
చార్లెట్లో జరిగిన ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026లో టీటీఏ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ప్రసంగించారు. 11 ఏళ్ల క్రితం చిన్న సంస్థగా టీటీఏ ప్రారంభమై అమెరికాలో ఒక ప్రముఖ ఆర్గనైజేషన్‌గా ఎదిగిందని ఆయన సగర్వంగా తెలిపారు. ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 10 వేల మందికిపైగా సభ్యులుగా ఉన్నారు.
సంస్థను ఈ స్థాయికి తీసుకురావడంలో డైనమిక్ ప్రెసిడెంట్ నవీన్ మలిపెద్ది, పాస్ట్ ప్రెసిడెంట్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎంతో కష్టపడ్డారని మల్లారెడ్డి అభినందించారు. ముఖ్యంగా అడ్వైజరీ కమిటీ చైర్ విజయపాల్ రెడ్డి, గత ఆరు నెలలుగా రేయింబవళ్లు శ్రమించి కన్వెన్షన్‌ను సక్సెస్ చేశారని ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ కన్వెన్షన్ నిర్వహణకు భారీగా నిధులు అవసరమని, విరాళాలు ఇచ్చిన దాతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కన్వీనర్ ప్రవీణ్ చింత గత ఆరు నెలల్లో 40కి పైగా నగరాలు తిరిగి, సగం కంటే ఎక్కువ నిధులు సేకరించడం అసాధారణమైన కృషి అని ప్రశంసించారు.
కోఆర్డినేటర్లు శేఖర్, నరేన్ ఎంతో కష్టపడ్డారని, వారి కృషి వల్లే ఈ కన్వెన్షన్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పారు. మీడియా సహా అందరు సభ్యులకు, టీటీఏ సంస్థ అభివృద్ధికి మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
తాను కేవలం ఫౌండర్‌ను మాత్రమేనని, సంస్థ ఇంతలా ఎదగడానికి విజయపాల్ రెడ్డి, నవీన్ , మొత్తం టీమ్ కృషి, వారి అంకితభావమే ప్రధాన కారణమని మల్లారెడ్డి పేర్కొన్నారు.ఈ కన్వెన్షన్ ద్వారా ప్రవాస తెలుగువారిలో ఐక్యతను చాటిచెప్పడం సంతోషకరమని, టీటీఏ మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








