స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పిరిట్(Spirit) సినిమా నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కీలక అప్డేట్ ఇచ్చారు. అమెరికాలో జరిగిన తెలుగు టాలెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇప్పటికే స్పిరిట్ షూటింగ్ 40% పూర్తైందని వెల్లడించారు. చాలా కాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి ప్రొడక్షన్ అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా, సందీప్ చేసిన ఈ అనౌన్స్మెంట్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. షూటింగ్ ప్లానింగ్ ప్రకారామే కొనసాగుతోందని, మిగిలిన భాగాన్ని కూడా రాబోయే నెలల్లో పూర్తి చేసేలా చిత్రబృందం ముందుకు సాగుతోందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తుండగా, తిరిగి వచ్చిన తర్వాత ఫౌజీ షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన స్పెషల్ మేకోవర్‌తో పాటు యాక్షన్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. హీరోయిన్గా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) నటిస్తుండగా, ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్(Vivek Oberai) కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ సిరీస్(T Series) తో పాటు భద్రకాళి పిక్చర్స్(Badrakali Pictures) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే 40% షూటింగ్ పూర్తవడంతో, మిగిలిన షెడ్యూల్స్‌ను వేగంగా పూర్తి చేసే దిశగా చిత్రబృందం ప్లాన్స్ రెడీ చేస్తోంది. 2027లో రిలీజ్ కానున్న ఇండియన్ సినిమాల్లో స్పిరిట్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఈ సినిమా కంటే ముందుగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ఫౌజీ తర్వాత స్పిరిట్ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తారనే అంచనాలు అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి.








