సర్ పేరిట బీజేపీ ఓట్లు తొలగిస్తున్నారు : రామచందర్రావు
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy)ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachander Rao) నేతృత్వంలో నేతలు కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పాతబస్తీలో సర్ నిర్వహణకు సీనియర్లకు బాధ్యత అప్పగించాలని రామచందర్రావు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ (BJP) సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ సీఈవోకు ఆయన ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ( Congress), ఎంఐఎం (MIM) కుమ్మక్కై అనర్హులను చేరుస్తున్నారని ఆరోపించారు. ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారికి ఓటు హక్కులేకుండా చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.








