కాకినాడ పోర్ట్ లో నందమూరి బాలకృష్ణ కాలికి గాయాలు!
టాలీవుడ్ లోని నటరత్న, నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షూటింగ్ సెట్ లో గాయపడ్డారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 చిత్రం షూటింగ్ కాకినాడ పోర్ట్ లొకేషన్ లో జరుగుతోంది. ఈ సినిమాలో హై యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ మోకాలికి గాయం అయ్యింది. వెంటనే సెట్ లోని సిబ్బంది అప్రమత్తమై ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, కొన్ని రోజులపాటు విశ్రాంతి సూచించారు. అయితే గాయం తీవ్రంగా లేదని, బాలకృష్ణ ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు. బాలకృష్ణకు సినిమా షూటింగ్ సెట్ లో గాయం అయ్యిందన్న వార్త బాలకృష్ణ అభిమానులలో తీవ్ర ఆందోళనకు కారణం అయ్యింది.
బాలకృష్ణ కోసం అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ వయసు 66 సంవత్సరాలు. అయినా బాలకృష్ణ తాను పని చేసే సినిమాలలో వయస్సుతో నిమిత్తం లేకుండా పూర్తి నిబద్ధతతో పని చేస్తారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ హై యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్న క్రమంలో ఫైట్ సీన్ లో మోకాలికి గాయం అయ్యింది. గతంలో కూడా బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ హైదరాబాద్ నారాయణ గూడ ఓవర్ బ్రిడ్జి పై నుండి దూకినపుడు ఆ సమయంలో ఇలాగే గాయాలైనా, ఆయన గాయాల నుండి కోలుకుని మళ్ళీ షూటింగ్ కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి.








