ఆగస్టు 3 నుండి మాటా SAT సమ్మర్ క్యాంప్
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘SAT సమ్మర్ క్యాంప్’ను నిర్వహిస్తోంది. SAT పరీక్షలో మంచి స్కోరు సాధించేందుకు వీలుగా, నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు.
కార్యక్రమ వివరాలు..
ఈ క్యాంప్ ఆగస్టు 3 నుండి 28, 2026 వరకు (సోమవారం నుండి శుక్రవారం వరకు) జరుగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు, మొత్తం 30 గంటల పాటు ఈ తరగతులు ఉంటాయి. SAT మ్యాథ్, ఇంగ్లీష్ (రైటింగ్ & రీడింగ్) విభాగాల్లోని అన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించి, పరీక్షా విధానంపై అవగాహన కల్పిస్తారు. మెంబర్స్ కోసం $130, నాన్-మెంబర్స్ కోసం $150 ఫీజుగా నిర్ణయించారు (సాధారణ ధర $500).
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల విద్యార్థులు ఇమేజ్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా లేదా అందించిన లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం లక్ష్మీకాంత్ గజూలను (732-619-7991) సంప్రదించవచ్చు.
సీట్లు పరిమితంగా ఉన్నందున, కళాశాల ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.








