ఆగస్టు 14 నుంచి గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ‘ఇండియా మేళా’
యుక్త ఈవెంట్స్ ఆధ్వర్యంలో, సలేహ సమర్పణలో ‘ఇండియా మేళా’ను ఆగస్టు 14, 15, 16 తేదీల్లో గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మÖడురోజులపాటు వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 14 (శుక్రవారం): సాయంత్రం 5:00 నుండి రాత్రి 9:00 వరకు ఈ మేళా జరుగుతుంది, ఆగస్టు 15 (శనివారం): మధ్యాహ్నం 12:00 నుండి రాత్రి 9:00 వరకు, ఆగస్టు 16 (ఆదివారం) మధ్యాహ్నం 12:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఉండే ఈ మేళాకు అందరూ రావాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఈ వేడుకలో షాపింగ్, సంగీతం, నృత్యాలు, విభిన్న వంటకాలతో పాటు 100కి పైగా ప్రసిద్ధ బ్రాండ్లు ఇందులో పాల్గొంటున్నాయి.
శుక్రవారం (ఆగస్టు 14): ‘భజన్ జమ్మింగ’ – సంగీత కార్యక్రమం, శనివారం (ఆగస్టు 15): లైవ్ కాన్సర్ట్ మరియు స్థానిక ప్రతిభావంతుల ప్రదర్శనలు, ఆదివారం (ఆగస్టు 16): గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఆశా జీ, కిషోర్ దా, రఫీ సాహబ్లకు ప్రత్యేక నివాళులర్పిస్తూ ‘జుగల్బందీ’ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో స్వాతి క్రిస్తమ్ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. న్యూయార్క్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ పార్టనర్ తీవన్ తైవకుమా సహకారం అందిస్తున్నారు. ఆశా-జ్యోతి సంస్థ ఈ కార్యక్రమంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇతర వివరాలకు సలేహ (848-213-1014), రాజ్ (732-997-8068), మలార్ (952-373-4041)ను సంప్రదించవచ్చు.








