ఎత్తుకు పైఎత్తు… వ్యూహాలకు ప్రతివ్యూహం ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ సమ్మర్ చెస్ టోర్నమెంట్ 2026
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం నిర్వహించిన సమ్మర్ చెస్ టోర్నమెంట్ కు భారీ స్పందన వచ్చింది. సెప్టెంబర్ 12న ఫిలడెల్ఫియాలోని ఎక్స్టన్ లో నిర్వహించిన ఈ చెస్ టోర్నమెంట్లో 100 మందికి పైగా ఆటగాళ్ళు పాల్గొన్నారు. ఇందులో సగానికిపైగా ఆటగాళ్ళు యుఎస్ చెస్ ఫెడరేషన్ రేటెడ్ ఆటగాళ్లు కావడం విశేషం. పోటీతత్వం, నేర్చుకునే తపన, క్రీడాస్ఫూర్తిని ఈ సందర్భంగా ఆటగాళ్ళు కనబరిచారు.
ఈ టోర్నమెంట్ను అత్యంత నైపుణ్యం, ఖచ్చితత్వం మరియు అంకితభావంతో నిర్వహించిన ట్రై-బ్రిడ్జెస్ చెస్ క్లబ్ టోర్నమెంట్ డైరెక్టర్ జాషువా ఆండర్సన్ కు తానా నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చెస్ టోర్నమెంట్ నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం, అంకితభావం ఈ టోర్నమెంట్లో పాల్గొన్నవారికి ప్రత్యేకమైన అనుభూతిని అందించింది. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన నాయుడమ్మ యలవర్తి, ప్రసాద్ కస్తూరి, సురేష్ యలమంచి, కృష్ణ నందమూరి, శ్రీధర్ సాదినేని, రంజిత్ మామిడి, చలం పావులూరి, వ్యోమ్ క్రోతపల్లి మరియు ధీరజ్ యలమంచికి కూడా తానా టీమ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది.
తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కోడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు మరియు స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావ ఈ టోర్నమెంట్ నిర్వహణకు తమవంతుగా మద్దతును అందించారు. ఈ టోర్నమెంటులో పాల్గొన్న ఆటగాళ్ళకు, వలంటీర్లకు ఇతరులకు తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ తరపున అభినందనలు తెలియజేశారు.
రేటెడ్ ఓపెన్ విజేతలు
ఫస్ట్ ప్లేస్- సాయి రేయాన్ష్ నగిశెట్టి
సెకండ్ ప్లేస్- హైంధవ్ మురుగేష్
3వ ప్లేస్– యువిన్ శ్రీనివాసన్
అండర్ 900 రేటెడ్ విజేతలు
ఫస్ట్ ప్లేస్– ప్రణవ్ కంతేటి
సెకండ్ ప్లేస్- కార్తికేయ కుర్చర్లపాటి
3వ ప్లేస్– రిధిక అరవిందకుమార్
అండర్ 500 రేటెడ్ విజేతలు
ఫస్ట్ ప్లేస్ — బోధి రాయ్
సెకండ్ ప్లేస్–విదిత్ కువేల్కర్
3వ ప్లేస్— నంద వి మేలం
కె8 అన్రేటెడ్ విజేతలు
ఫస్ట్ ప్లేస్ –కుశాల్ తడువాయి
సెకండ్ ప్లేస్–శ్రీయాన్ వజ్రాల
3వ ప్లేస్– అడ్రియన్ బెన్సన్
9-12 (పెద్దలతో కలిపి) అన్రేటెడ్ విజేతలు
ఫస్ట్ ప్లేస్— సునీల్ కొత్త
సెకండ్ ప్లేస్- పునీత్ మద్ది
3వ ప్లేస్– జీవన్ మర్రిబోయిన











