తేమ ఎక్కువసేపు ఉండటం వల్ల గోళ్లు చీలిపోయే అవకాశం ఉంది. చేతులు కడిగిన తర్వాత గోళ్లను, ముఖ్యంగా కింద భాగాన్ని బాగా ఆరబెట్టండి.
గోళ్లను శుభ్రంగా, పొడిగా ఉంచండి
క్యూటికల్స్ గోళ్ల చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాటిని కత్తిరించడం లేదా బలంగా వెనక్కి నెట్టడం ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచవచ్చు.
క్యూటికల్స్‌ను కట్ చేయకండి
ప్రతిరోజూ హ్యాండ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్‌ను గోళ్లు, క్యూటికల్స్‌పైనా అప్లై చేయండి. పొడిబారడం, చీలిపోవడం తగ్గేందుకు ఇది సహాయపడుతుంది.
మాయిశ్చరైజర్‌తో గోళ్లకు కేర్
డిష్‌వాషింగ్ లేదా క్లీనింగ్‌లో నీరు, డిటర్జెంట్లకు ఎక్కువసేపు గోళ్లు గురికాకుండా కాటన్-లైన్డ్ రబ్బర్ గ్లోవ్స్ ఉపయోగించండి.
పనులు చేసేటప్పుడు గ్లోవ్స్ తప్పనిసరి
క్లీన్ క్లిప్పర్‌తో గోళ్లను కట్ చేసి, చివర్లను మృదువుగా ఫైల్ చేయండి. చాలా లోతుగా కట్ చేయకుండా సహజమైన ఆకారాన్ని ఉంచడం మంచిది.
గోళ్లను సరైన ఆకారంలో ట్రిమ్ చేయండి
తరచుగా అక్రిలిక్ లేదా జెల్ మానిక్యూర్ చేయడం గోళ్లను బలహీనపరచవచ్చు. మధ్యలో సహజ గోళ్లకు విశ్రాంతి ఇవ్వడం మంచిది.
జెల్ & అక్రిలిక్‌కు కొంత విరామం ఇవ్వండి
జెల్‌ను గోళ్లపై నుంచి గీయడం లేదా బలంగా ఫైల్ చేయడం వల్ల నష్టం కలగవచ్చు. సరైన రిమూవల్ పద్ధతిని పాటించి, తర్వాత క్యూటికల్స్‌కు మాయిశ్చరైజర్ ఇవ్వండి.
జెల్ పాలిష్ తీసేటప్పుడు జాగ్రత్త
నెయిల్ ఆర్ట్ ఎంత అందంగా ఉన్నా గోళ్ల ఆరోగ్యం ముఖ్యం. మార్పులు, రంగు లేదా ఆకృతిలో అసాధారణత కనిపిస్తే నిపుణుడిని సంప్రదించండి.