జుట్టు ఒత్తుగా, కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా సహాయపడే అద్భుతమైన హెయిర్ ఆయిల్స్ ఏమిటో చూద్దాం!
ప్రతి ఇంటిలో ఉండే కొబ్బరి నూనె జుట్టును తేమగా ఉంచి, కుదుళ్లకు లోతుగా పోషణందించి రాలడాన్ని తగ్గిస్తుంది.
కొబ్బరి నూనె
సల్ఫర్ సమృద్ధిగా ఉండే ఉల్లిపాయ నూనె కొత్త జుట్టు ఎదుగుదలకు, కుదుళ్ల బలానికి ఎంతగానో తోడ్పడుతుంది.
ఉల్లిపాయ నూనె
విటమిన్ ఇ నిండిన బాదం నూనె జుట్టును మృదువుగా మార్చి, చిట్లిపోకుండా కాపాడి రాలడాన్ని నివారిస్తుంది.
బాదం నూనె
పొడిబారిన జుట్టుకు తగినంత తేమను అందించి, తలపై రక్తప్రసరణను మెరుగుపరిచి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది.
ఆలివ్ ఆయిల్
ఉసిరికాయ నూనెలో ఉండే విటమిన్ సి జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, అకాల నెరుపును కూడా తగ్గిస్తుంది.
ఆమ్లా ఆయిల్
ఆముదం చాలా చిక్కగా ఉంటుంది. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది.
కాస్టర్ ఆయిల్
రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ను ఏదైనా క్యారియర్ ఆయిల్‌లో కలిపి రాస్తే జుట్టు రాలడం వేగంగా తగ్గుతుంది.
రోజ్మేరీ ఆయిల్
ఆయుర్వేదంలో ఎంతో పేరున్న భృంగరాజ్ నూనె జుట్టు సమస్యలన్నింటికి చెక్ పెట్టి చక్కటి నిగారింపు ఇస్తుంది.
భృంగరాజ్ ఆయిల్
చుండ్రు సమస్య ఉండి జుట్టు రాలుతుంటే, నూనెలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి మసాజ్ చేస్తే మంచిది.
టీ ట్రీ ఆయిల్