ట్రెడిషనల్ లుక్ లోనూ అదరగొడుతున్న రాజాసాబ్ బ్యూటీ
పట్టం పోల్(Pattampol) సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన మాళవిక మోహనన్(Malavika Mohanan).. మాస్టర్(master), తంగలాన్ (Thangalaan) వంటి సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. మరోసారి తన గ్లామర్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. లైట్ బ్లూ ఎంబ్రాయిడరీ టాప్, పింక్ సిల్క్ స్కర్ట్‌లో సంప్రదాయ అందానికి అమ్మడు గ్లామర్ టచ్ ఇచ్చింది. వేవీ హెయిర్, నోస్ రింగ్, సింపుల్ జువెలరీతో మాళవికా లుక్ మరింత హైలైట్ అయ్యింది. మాళవిక షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.








