శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ (Shanta Sriram Constructions) వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ సంస్థకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court,) కొట్టివేసింది. హైకోర్టు (High Court) తీర్పును సకాలంలో సవాలు చేయలేదని పేర్కొంది. తగిన సమయంలో పిటిషన్ దాఖలు చేయకపోవడంతో విచారణకు తీసుకోలేమంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం డిస్మస్ చేసింది. సికింద్రాబాద్ ప్రాంతంలోని వివాదాస్పద భూమి ప్రైవేటుదేనని తెలిపింది. 40 ఎకరాలు శాంతా శ్రీరామ్ సంస్థకే చెందుతుందని స్పష్టం చేసింది.








