హరీశ్‌రావు ఆరోపణలను ఖండించిన సైఫాబాద్ పోలీసులు
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పీఆర్వో , ఏపీ మహేశ్, మహేందర్ లపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao) ఆరోపించారు. ముసుగు ధరించి పోలీసులే దాడి చేశారన్నారు. విచారణ గదిలోకి వెళ్లి మరీ వారిపై పోలీసులు దాడికి యత్నించారని, బీఆర్ఎస్ లీగల్ టీమ్ కేకలు వేయడంతో పారిపోయారని పేర్కొన్నారు. హరీశ్‌రావు చేసిన ఆరోపణలను సైఫాబాద్ పోలీసులు (Saifabad police) ఖండిస్తూ వివరణ ఇచ్చారు. గణేశ్ మండపం వద్ద డీజే పర్మిషన్ ( DJ permission) కోసం యువకులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అసెంబ్లీ (Assembly) వద్ద న్యూసెస్స్ చేసిన వారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని ఆ యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పీఎస్ నుంచి పంపేశాం. పోలీసులు సమక్షంలోనే దాడి చేశారన్న ప్రచారంలో నిజం లేదు అని పోలీసులు తెలిపారు.








