పండగ కళ మొత్తం శ్రీముఖిలోనే!
వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు బుల్లితెర నటి శ్రీముఖి(Srimukhi) సంప్రదాయ అందాలను సరికొత్త స్టైల్లో ఆవిష్కరించింది. పండుగకు తగ్గట్టుగా లంగా ఓణీలో ముస్తాబైన ఆమె, తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. లేత ఆకుపచ్చ, పింక్, లావెండర్ రంగుల కలయికతో ఉన్న చీరలో శ్రీముఖి ఎంతో ఎట్రాక్టివ్‌గా కనిపించింది. దీనికి మెరిసిపోయే సిల్వర్ డిజైనర్ బ్లౌజ్‌ను జత చేసి తన లుక్‌ను మరింత స్పెషల్ గా మార్చుకుంది. మెడలో భారీగా కనిపించే సంప్రదాయ హారం, చెవులకు జుంకాలు, నుదుటిపై మాంగ్ టిక్కా, చేతులకు రంగురంగుల గాజులు ఆమె పండుగ లుక్కు మరింత వన్నె తీసుకొచ్చాయి.
ఇక పొడవాటి జడను వేసుకుని, దానికి పూలను అలంకరించుకోవడం మరో హైలైట్‌గా నిలిచింది. నేచురల్ స్మైల్‌తో, విభిన్నమైన పోజులతో శ్రీముఖి కెమెరాకు ఫోజులిచ్చింది. పండుగ వాతావరణానికి సరిపోయే నేచురల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫొటోషూట్ చేయడంతో మొత్తం లుక్ మరింత అందంగా కనిపిస్తోంది. వినాయక చవితి వేళ ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ హంగులు, మోడ్రన్ టచ్ కలిసిన శ్రీముఖి లుక్కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.








