మరోసారి కంటతడి పెట్టుకున్న బొత్స సత్యనారాయణ
వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మరోసారి కంటతడి పెట్టారు. పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మాట్లాడుతున్న సమయంలో బొత్స ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను(Chinna Srinu) ఇటీవల టీడీపీ(TDP)లో చేరిన నేపథ్యంలో ..స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైసీపీ ముఖ్య నాయకులు (YCP leaders) ఈ సమావేశానికి హాజరయ్యారు. అమర్నాథ్ మాట్లాడుతున్న క్రమంలో బొత్స భావోద్వేగంతో కంటతడి పెట్టడంతో నాయకులు, కార్యకర్తలు ఓదార్చారు.








