కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు
రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), కేంద్ర మంత్రి జేపీ నడ్డా (J.P. Nadda) కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ (Critical Care Block)ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను వర్చువల్గా ప్రారంభించారు. సీఎంతో పాటు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav), ఎంపీ కేశినేని శివనాథ్( Kesineni Sivanath) ( చిన్ని) స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








