11th September 2026

_________

- Bhuvana

చర్మం మెరిసిపోవాలంటే ఆలివ్‌ ఆయిల్‌తో ఈ స్కిన్‌కేర్‌ చిట్కాలు

సహజసిద్ధమైన కాంతివంతమైన చమ్రం మీ సొంతం కావాలంటే ఆలివ్‌ ఆయిల్‌తో ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో అర స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుని, పది నిమిషాల తర్వాత కడిగితే చర్మం మృదువుగా మారుతుంది.

ఆలివ్ ఆయిల్ మరియు తేనె మాస్క్

కొద్దిగా బ్రౌన్ షుగర్‌లో ఆలివ్ ఆయిల్ కలిపి సున్నితంగా స్క్రబ్ చేయడం ద్వారా మృతకణాలు తొలగిపోయి కాంతి వస్తుంది.

షుగర్ మరియు ఆలివ్ ఆయిల్ స్క్రబ్

ఆలివ్ ఆయిల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రాస్తే ముఖంపై ఉన్న మచ్చలు క్రమంగా తగ్గిపోయి గ్లో పెరుగుతుంది.

నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్

చిటికెడు పసుపు, శెనగపిండి, ఆలివ్ ఆయిల్ కలిపి పేలా తయారుచేసి ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

పసుపుతో ఆలివ్ ఆయిల్ ప్యాక్

పడుకునే ముందు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌తో ముఖానికి మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగై చర్మం నిగనిగలాడుతుంది.

రాత్రిపూట ఆలివ్ ఆయిల్ మసాజ్

రెండు స్పూన్ల పెరుగులో ఆలివ్ ఆయిల్ కలిపి రాస్తే చర్మానికి తగినంత తేమ అంది పొడిబారడం పూర్తిగా తగ్గుతుంది.

పెరుగు మరియు ఆలివ్ ఆయిల్

అలవెరా జెల్‌లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గి చర్మం తాజాగా మారుతుంది.

కలబంద గుజ్జుతో కలిపి

పొడిబారిన పెదాలపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ రాస్తే పెదాలు మృదువుగా, గులాబీ రంగులో అందంగా మారుతాయి.

పెదాల సంరక్షణకు ఆలివ్ ఆయిల్

రోజూ రాత్రి పూట ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది.

గ్లోయింగ్ స్కిన్ కోసం రోజూ