మంత్రి లోకేష్ చేతుల మీదుగా గ్లోబల్ ఎన్నారై టీడిపి వెబ్ సైట్ ప్రారంభం
మంగళగిరిలో జరిగిన గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఎన్నారై టీడిపి వెబ్ సైట్ ను ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వెబ్ సైట్ ను కెనడాకు చెందిన ఎన్నారై సూర్య బెజవాడ రూపొందించారు. గ్లోబల్ ఎన్నారై టీడిపి అధ్యక్షుడు డా. గురురాజా సూచనలతో ఆయన ఈ వెబ్ సైట్ ను రూపొందించారు. ఇందులో ఎన్నారై సెంట్రల్ కమిటీ నిర్వహించే కార్యక్రమాలు, కనెక్ట్ ఎపి పేరుతో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల వివరాలు, ఎన్నారై హబ్ పేరుతో ఎన్నారైలకు అందించే సహాయ కార్యక్రమాలు వంటివి ఉంటాయి. చాప్టర్ల వివరాలు కూడా ఇందులో చూడవచ్చు. ఈ వెబ్ సైట్ కు సంబంధించి మరిన్ని సమాచారం కోసం మీరు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
https://globalnritdp.org/in/nri-hub








