త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు : మంత్రి పొన్నం
గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ (RTC) మూసివేసే పరిస్థితి ఉండగా ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. శానససభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానాలిచ్చారు. పీఎం ఈడ్రైవ్ కింద హైదరాబాద్ (Hyderabad) నగరానికి 2,200 బస్సులు రాబోతున్నాయని తెలిపారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల(Elections)కు గత ప్రభుత్వం రద్దు చేసిందన్న మంత్రి, త్వరలో ఎన్నికల తేదీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్ నగరానికి 100 మినీ బస్సులు రాబోతున్నాయి. వాటిలో 50 పాతబస్తీకి, మరో 50 బస్సులు ఎంఎంటీఎస్, మెట్రోతో అనుసంధానిస్తాం. 347.47 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పొందగలిగారు. ఇది ఒక చరిత్ర అని తెలిపారు.








