జి.వి.ప్రకాష్ కుమార్ చేతుల మీదుగా ‘చకోర – Lunar Love Bird’ మూవీ లో సెకండ్ సాంగ్
మాస్ పోయెట్రీతో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘చకోర – Lunar Love Bird’ చిత్రంలోని సెకండ్ ఎనర్జటిక్ సాంగ్ ‘ధమ్ ధమ్ ’ లిరికల్ వీడియోను GV ప్రకాష్ కుమార్ ఆవిష్కరించారు. High Joy Commercials బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కింది. ఆణిముత్యాల్లాంటి పాటలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు సాహిత్యం అందించారు. డాన్స్ మాస్టర్ మెహర్ బాబా కొరియోగ్రఫీ అందించారు. నూతన గాయని అభిఖ్య తనికెళ్ళ ఈ ఎనర్జటిక్ సాంగ్ ని పాడారు.. ఈ సాంగ్ యువతని ఊర్రూతలూగించేలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా మ్యూజికల్ హీరో – ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ.GV ప్రకాష్ కుమార్ గారు ప్రశంసించారు.
‘చకోర – Lunar Love Bird’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. TSeies Music ద్వారా చిత్ర ఆడియో ప్రేక్షకులను అలరించనుంది.








