ఎన్నారైల అండతో తెలుగుదేశం జెండా రెపరెపలు… గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి లోకేష్
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తెలుగుజాతిని నెం.1గా చేసే బాధ్యత సమిష్టిగా తీసుకుందామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పలు విషయాలను చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. రాజకీయాల్లో చదువుకున్న వారికి, మేధావులకు అవకాశం కల్పించారు. పందొమ్మిది వందల ఎనభై రెండులో, రెండు వందల తొంబై నాలుగు స్థానాల్లో నూట ఇరవై ఐదు మంది గ్రాడ్యుయేట్లు, ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇరవై మంది మెడికల్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లకి ఆయన సీటు ఇచ్చారు. ఆలోచన సమాజానికి మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్. సమాజంలో మార్పు కోసం కృషిచేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలను చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. 1999 ఎన్నికల్లో రెండు వందల తొంబై నాలుగు స్థానాలు గాని, నూట పందొమ్మిది మంది కొత్తవాళ్ళకు చంద్రబాబు గారు అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల్లో కూడా యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తొలిసారిగా 50శాతం స్థానాల్లో యువకులు గెలుపొందారు. ఏడుగురు ఎనఆరఐలకు కూడా అవకాశం ఇచ్చారు. అమెరికా నుంచి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ టీడిపి అభ్యర్థిగా గుంటూరు నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు.
అమరావతిలో మేమందరం పోరాడుతుంటే, మా పోరాటానికి కలిసి వచ్చింది ఎన్నారైలు. న్యాయపోరాటానికి డబ్బులు కూడా సేకరించి, వాళ్ళతో కలిసిగట్టుగా మేము పోరాడాము. 2019-24 మధ్య రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. ఆ సమయంలో ఎన్నారైలు తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. కేసులు పెట్టినా భయపడలేదు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు 50 దేశాల్లో 200 పట్టణాల్లో ఎన్నారైలు కార్యక్రమాలు నిర్వహించారు. నారా బ్రాహ్మణి మనకు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. అలాంటి సమయంలో నిర్వహించిన ‘ఐయామ్ విత్ సీబీఎన్’ కార్యక్రమం మా కుటుంబానికి కొండంత బలంగా నిలిచింది. మళ్లీ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. ఐదు వేల డాలర్లు ఖర్చుపెట్టి ఓటు వేయడానికి ఎన్నారైలు రాష్ట్రానికి వచ్చారు. కొన్ని నెలల పాటు ఉద్యోగాలకు సెలవు పెట్టి గ్రామాల్లో తిరిగారు. ప్రజలను చైతన్య పరిచారు. ప్రజాప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములయ్యారు. ప్రాంతం కోసం, నమ్మకున్న పార్టీ కోసం, తెలుగు జాతి కోసం ఈరోజు మీరందరూ కష్టపడుతున్నారు. మీ పిల్లలు నాకన్నా అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు. తడబడకుండా, భయపడకుండా, అద్భుతంగా తెలుగు లో మాట్లాడుతున్నారు. మీ లాగానే మీ పిల్లలు కూడా అదే దిశగా పెరుగుతున్నారు.



ఎన్నారైలు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మంచి ఉద్యోగాలు చేస్తున్నా.. నమ్ముకున్న పార్టీ కోసం, తెలుగుజాతి కోసం నిలబడ్డారు. మీ పిల్లలకు అద్భుతమైన తెలుగు నేర్పిస్తున్నారు. తెలుగుతనం ఏనాడూ మర్చిపోలేదు. సొంత గ్రామాలపై మమకారం, సేవాభావం ఎక్కువ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, అనేక మంది ఎన్నారైలు తిరిగి వచ్చి, వాళ్ళు చదువుకున్న పాఠశాలలకు లక్షలు కాదు, కదా, కోట్లాది రూపాయలు ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అది మీకున్న కమిట్ మెంట్. దానికి సభా ముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. రెండువేల పదమూడులో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినాయి. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు గానీ, మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆయన ఉత్తరాఖండ్ కి వెళ్లారు. తెలుగు వాళ్ళందరినీ కలిశారు. ఏకంగా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి, తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిది. ఏ దేశంలో అయినా, ఏ పట్టణంలో అయినా, పదిమంది తెలుగువారు ఉంటే, అక్కడ ఎన్నారై టీడీపీ కమిటీ ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తెలుగు జాతి కోసం పోరాడే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సో, వాళ్ళకి అండగా నిలబడాలంటే ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మనందరి దయ ఉంది. తెలుగు వారి కోసం నిరంతరం మనమందరం కష్టపడాలి. వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అన్ని రంగాల్లో మనం నెంబర్ వన్ స్థానం సంపాదించుకోవాలి. దానికోసం ఆహర్నిశలు పని చేయాలని నారా లోకేష్ కోరారు.
ఎన్నారైలతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. 2013 నుంచి గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డాక్టర్ గురు రాజాతో తనకు అనుబంధం ఉందని, 13 సంవత్సరాలుగా ఆయన తనకు ఎంతో మద్దతుగా నిలిచారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. తనపై డాక్టర్ రాజాకు అపారమైన నమ్మకం ఉందని, తనను ఎవరూ నమ్మని రోజుల్లో ఆయన తన వెన్ను తట్టి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు డాక్టర్ రాజా గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేశారని, ఆయనతో పాటు కమిటీ సభ్యులందరినీ అభినందిస్తున్నానని చెప్పారు.
ఎన్నారై సభ్యత్వం తీసుకురావాలి
ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీరు చేసిన కృషి మరువలేనిది. ఎనఆరఐ సభ్యత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరంతా ‘మై టీడీపీ యాప’ తో అనుసంధానం కావాలి. 2019-24 మధ్య అనేక మంది న్యూట్రల్స్ కు ఫోన్ చేసి ఎన్నికల్లో గెలుపునకు కృషిచేశారు. తిరిగి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. డాక్టర్ గురురాజా గారిపై బాధ్యత పెరిగింది. ఏ దేశంలో పది మంది ఉన్నా ఎనఆరఐ టీడీపీ కమిటీ ఉండాలని కోరుతున్నా. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం జయప్రదం చేయాలి. రాబోయే 30 రోజుల్లో ఇప్పుడున్న కమిటీలను పూర్తిచేద్దాం. కష్టపడిన వారికి కమిటీల్లో స్థానం కల్పించాలని కోరారు.








