పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? సాధారణ కారణాలు ఏంటో తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోండి.
అధిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది రుతుక్రమం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం.
ఒత్తిడి (Stress)
శరీర బరువు అకస్మాత్తుగా పెరిగినా లేదా తగ్గినా హార్మోన్లలో మార్పులొచ్చి పీరియడ్స్ మారుతాయి.
బరువులో హెచ్చుతగ్గులు
థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే జీవక్రియ మందగించి నెలసరి క్రమం తప్పుతుంది.
థైరాయిడ్ సమస్యలు
హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల కాక పీరియడ్స్ చాలా రోజులు ఆలస్యం కావచ్చు.
పీసీఓఎస్ (PCOS)
శరీర శ్రమ లేదా కఠినమైన వ్యాయాయం అతిగా చేస్తే శరీరంలో శక్తి తగ్గి పీరియడ్స్ ఆగిపోతాయి.
అధిక వ్యాయాయం
ఋతుక్రమం ఆలస్యం కావడానికి అత్యంత సాధారణమైన, మొదటి కారణం ప్రెగ్నెన్సీ కావచ్చు.
గర్భధారణ
కొన్ని రకాల కొత్త మందులు లేదా హార్మోన్ల గర్భనిరోధక pills వాడటం వల్ల కూడా ఇది జరుగుతుంది.
మందుల ప్రభావం
టీనేజ్ వయసులో లేదా రుతువిరతి (Menopause) సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి.
వయసు ప్రభావం
సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.