విజయవాడ – తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు
తిరుపతి-విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు(Flight service) నడిపేందుకు ఫ్లై19 విమానయాన సంస్థ ముందుకొచ్చింది. సంస్థ కార్యకలాపాలను గురువారం నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లై 19 విమాన సర్వీసు తిరుపతి(Tirupati)లో ఉదయం 8:05 గంటలకు బయలుదేరి 9:15 గంటలకు విజయవాడ(Vijayawada) అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి 10:50 గంటలకు తిరుపతికి వెళ్తుంది. వారంలో నాలుగు రోజులపాటు(Four days) ఈ సర్వీసు నడవనుంది. విమాన టికెట్ ధర రూ.3 వేల నుంచి రూ.3,500ల మధ్య ఉండనుంది.








