నాట్స్ షికాగో చాప్టర్ నూతన కార్యవర్గం ఎన్నిక..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్ – North America Telugu Society) షికాగో చాప్టర్ నూతన కార్యవర్గాన్ని 2026-2028 సంవత్సరానికి ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఈ నూతన బృందానికి నాట్స్ చైర్మన్‌గా కిషోర్ కంచర్ల (Kishore Kancharla), అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ (Raj Allada) వ్యవహరించనున్నారు. అలాగే షికాగో చాప్టర్ లీడ్‌గా నరేంద్ర కడియాల (Narendra Kadiyala) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు నాట్స్ షికాగో చాప్టర్ టీమ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (BOD), ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యుల పూర్తి వివరాలు వెల్లడయ్యాయి.
షికాగో చాప్టర్ సభ్యులు..
షికాగో చాప్టర్ సభ్యులుగా అంజయ్య వేలూరి, మహేష్ కిలారు, ప్రతిభ వట్టికూటి, దివ్య శ్రీ వేముల, సతీష్ త్రిపురనేని, చెన్నయ్య కంబాల, వరుణ్ కుమార్ రెడ్డి గడ్డం, నాగరాజ్ మేడ, భానుచందర్ కీర్తి , అలాగే సుబ్బరాయుడు చావడం కొనసాగనున్నారు. అలాగే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (BOD), ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) విభాగాలకు సంబంధించి శ్రీనివాస్ బొప్పన, శ్రీరామ్ కొప్పాక , శేషు మరంరెడ్డి, మదన్ పాములపాటి, వీర తక్కెళ్ళపాటి వివిధ కీలక బాధ్యతల్లో నియామకమయ్యారు.








