ఒకేసారి రెండు సినిమాలు.. మూడు సార్లు డబుల్ బ్లాక్‌బస్టర్!
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా భారీ సక్సెస్ సాధించడమే నిర్మాతలకు పెద్ద సక్సెస్ గా భావించే పరిస్థితుల్లో, మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) మాత్రం అత్యంత అరుదైన ఘనతను నమోదు చేసింది. ఒకే రిలీజ్ డేట్‌కు రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, రెండింటినీ సక్సెస్ చేయడం ఒక్కసారి కాదు.. మూడు వేర్వేరు సందర్భాల్లో సాధించడం విశేషం. స్టార్ హీరోలతో పాటు విభిన్న మార్కెట్లలో సినిమాలు నిర్మిస్తూ, కమర్షియల్ సక్సెస్‌లో మైత్రీ తనదైన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుచుకుంది.
ఈ అరుదైన ప్రయాణానికి శ్రీకారం 2023 సంక్రాంతితో పడింది. ఆ టైమ్ లో రిలీజైన వీరసింహారెడ్డి(Veera simha reddy), వాల్తేరు వీరయ్య(waltair veerayya) సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌లు సాధించాయి. ఆ తర్వాత 2025 ఏప్రిల్ 10న మరోసారి ఒకే తేదీన గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly), జాట్(jaat) సినిమాలను రిలీజ్ చేసి డబుల్ సక్సెస్‌ను అందుకుంది. రెండు వేర్వేరు భాషలు, వేర్వేరు మార్కెట్లు అయినప్పటికీ.. రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ఆదరణతో గ్రాండ్ సక్సెస్‌లుగా నిలవడం మైత్రీ స్ట్రాటజీకి నిదర్శనంగా మారింది.
ఇప్పుడు 2026 ఆగస్టు 21న విడుదలైన ఇరుముడి(Irumudi), మొద రాత్రి(Moda Ratri) సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ అరుదైన ఫీట్‌ను మూడోసారి నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసి, మొత్తం ఆరు బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లను అకౌంట్ లో వేసుకోవడం సాధారణ విషయం కాదు. వరుస విజయాలతో పాటు ఇలాంటి అసాధారణ రికార్డు మైత్రీ మూవీ మేకర్స్‌ను భారతీయ సినీ నిర్మాణ రంగంలో ప్రత్యేక స్థాయిలో నిలబెడుతోంది.








