నాని సినిమా మళ్లీ వాయిదా పడుతుందా?
నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ది ప్యారడైజ్(The paradise) షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సెప్టెంబర్ చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో టీమ్ ముందుకు వెళ్లినట్లు ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం రిలీజ్ ను వారం రోజుల పాటు వాయిదా వేసి అక్టోబర్ తొలి వారాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
సినిమా షూటింగ్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి పలు యూనిట్లు ఏకకాలంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిర్మాణంలో జాప్యంపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల విమర్శలను ఎదుర్కొంటుండగా, సినిమా బడ్జెట్ కూడా ఊహించిన స్థాయిని దాటినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. భారీ పెట్టుబడితో రూపొందుతున్న ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కీలకంగా మారనుండగా, రైట్స్ కోసం మార్కెట్లో మంచి పోటీ కనిపిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం చిత్రబృందానికి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. నాని సరసన కయదు లోహర్(Kayadhu Lohar) నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్(anirudh Ravichander) మ్యూజిక్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పుడు ది ప్యారడైజ్ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందన్నదే అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌గా మారింది.








