రాయల్ లుక్ లో అదరగొడుతున్న అవికా
చిన్నారి పెళ్లికూతురు(Chinnari Pellikuthuru) సీరియల్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న అవికా గోర్(Avika Gor), ఉయ్యాలా జంపాల(Uyyala Jampala) సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన అవికా, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉండే అవికా, తాజాగా రాజసం, అందం, సంప్రదాయం అన్నీ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న డిజైనర్ బ్లౌజ్, మెరూన్ వెల్వెట్ లెహంగా ధరించి దానికి హెవీ జ్యువెలరీ, మినిమల్ క్లాసీ మేకప్, ఎలిగెంట్ హెయిర్ స్టైల్ తో ఆమె లుక్ కు రాయల్ వైబ్ ను ఇవ్వగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.








