మణిరత్నం ఈజ్ బ్యాక్..! గ్లింప్స్‌తోనే పెంచేసిన అంచనాలు
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న డైరెక్టర్లలో మణిరత్నం(Maniratnam) ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తరతరాల ప్రేక్షకులను తన కథలు, ఎమోషన్స్, విజువల్ ట్రీట్‌తో ఆకట్టుకున్న ఆయనకు ఇటీవల కొన్ని ఫ్లాపులొచ్చినా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ సేతుపతి(Vijay Setupati), సాయిపల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరీపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ను సెప్టెంబర్ 7న అనౌన్స్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
టైటిల్ అనౌన్స్మెంట్కు ముందు రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్‌లో మణిరత్నం మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. లైఫ్ లో కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కాకుండా అనేక రంగులు ఉంటాయనే భావనను విజువల్స్ ద్వారా అందంగా ఆవిష్కరించారు. దీనికి ఏఆర్ రెహమాన్ అందించిన సాఫ్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ వీడియో చూసిన తర్వాత మణిరత్నం నుంచి మరోసారి హృదయానికి హత్తుకునే ప్రేమకథ రాబోతోందనే అంచనాలు అభిమానుల్లో పెరిగాయి.
ఈ సినిమాకు బెంగాలీ సినిమాటోగ్రాఫర్ అన్విక్ ముఖోపాధ్యాయ్(Anvik Mukhopadhyay) కెమెరా బాధ్యతలు చేపట్టడం విశేషం. అలాగే ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్(Srikar Prasad) ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. మద్రాస్ టాకీస్(Madras Talkies), లైకా ప్రొడక్షన్స్(Lyca productions) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.








