సోషల్ మీడియాలో కామెంట్ చదివి బిజినెస్, నెలకు 14 లక్షలు ఆదాయం
ఫేస్ బుక్, ఇనిస్ట్రగ్రామ్, ట్విట్టర్. యూట్యూబ్ ఇలా రోజంతా మనం ఎన్నో సోషల్ మీడియా ఎక్కౌంట్స్ ద్వారా ఎన్నో వీడియోలు, రీల్స్ చూస్తూంటాం, ఒక్కోసారి వాటి క్రింద కామెంట్స్ చదువుతూంటాం. ఎంజాయ్ చేస్తూంటాం. అది మన లైఫ్ స్టైయిల్ లో ఒక భాగం అయ్యిపోయింది. ఎవరు వద్దన్నా, చివరకి వాటిని కనిపెట్టిన వాళ్లు వచ్చిన చెప్పినా ఆగం.అయితే వీటి వల్ల టైమ్ వేస్ట్, జీవితం వేస్ట్ అని మన పెద్దోళ్లు తిడుతూనే ఉన్నారు. ఉంటారు.
కానీ కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా రీల్స్ కూడా మనకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి. మనకు కొత్త ఆలోచనలు తెచ్చిపెడతాయి. డబ్బులు అందిస్తాయి. కాదేదీ కవితకు అనర్హం అని శ్ఱీశ్రీ చెప్పినట్లు కాదేదీ బిజినెస్ కు అనర్హం అని సోషల్ మీడియాలో ఓ కామెంట్ చదవి అర్దం చేసుకుని బిజినెస్ పెట్టి కోట్లు సంపాదిస్తున్నాడో కుర్రాడు.
అవును నెలకు అక్షరాలా 14 లక్షలు దాకా సంపాదిస్తున్నాడు. అంత గొప్ప వ్యాపారం ఏంటి అంటారా…గోకటం.అరే..మీరు సరిగ్గానే చదివారు…అయితే ఇక్కడో చిన్న సూచన. గోకటం అనగానే వేరే విధంగా ఊహించకోవద్దు. మేము చెప్పింది గోళ్లతో గోక్కోవమే.ఈ సోషల్ మీడియా కామెంట్ కు, ఈ గోక్కోవటానికి, బిజినెస్ కు, లక్షలకు సంభంధం ఏమిటీ అంటారా..ఉంది..పెద్దగానే ఉంది.
ఆ కుర్రాడిది చైనా. అతనికి మనలాగే సోషల్ మీడియా పిచ్చి..అలా స్క్రోలింగ్ చేస్తూ ట్రోలింగ్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తూంటే ..ఓ రోజు ఓ రొటీన్ వీడియో క్రింద కొన్ని గమ్మత్తైన కామెంట్స్ కనిపించాయి. ఆ వీడియోలో ఏముంది…ఒకావిడ ..పనిపాటా లేక తన భర్త వీపు గోకుతోంది. అతను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వీడియో క్రింద కొందరు..ఆహా ఏమి జీవితంరా నీది అని రాస్తే ..మరికొందరు నాకూ ఇలా గోకితే బాగుండని రాసారు. మరికొందరు గోకిపెడితే డబ్బులిస్తామయ్యా…రండయ్యా అని రాసారు.ఇదే ఈ కుర్రాడిని ఎట్రాక్ట్ చేసింది. భలే ఉందే. గోకుడు బిజినెస్ పెడితే ఎలా ఉంటుందనిపించింది.
మనమైతే నవ్వుకుని వదిలేస్తే. అయితే ఆ కుర్రాడు మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. చిన్న షాప్ పెట్టి పబ్లిసిటీ చేసాడు. అదే సోషల్ మీడియాలో ఇలా గోకుడు బిజినెస్ పెట్టామన్నాడు. మొదట జనాలకు వెటాకారంగా వచ్చారు. తర్వాత అక్కడ అలవాటు పడ్డాు. మెల్లిగా జనం డబ్బులు చెల్లించి తమ శరీరాన్ని గోకించుకుంటున్నారు.
అంటే కామెంట్ క్రింద మరో కామెంట్ చేయకుండా ..దాంట్లో బిజినెస్ ని వెతకటమే అతను చేసిన గొప్ప విషయం.అయితే కుర్రాడు ఏదో దువ్వెన పట్టుకుని వచ్చిన జనాలు వీపులు బరబరా గోక్కుంటూ కూర్చొంటే …అక్కడితో ఆగిపోయేవాడు. అలా కాకుండా ఈ సర్వీస్ ని ఎలా ప్రొఫెషనల్‌గా మార్చాలనే విషయంపై పనిచేశాడు. శరీరంలోని వివిధ భాగాలపై ఎలా, ఎంత సున్నితంగా గోకాలి? కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సేవను ఎలా అందించాలి? అనే అంశాలను అధ్యయనం చేశాడు.
ఇంకా ఫెరఫెక్ట్ గా చెప్పాలంటే…అతను ఒక స్క్రాచింగ్ విధానాన్ని అభివృద్ధి చేశాడు.దాన్ని అక్కడితో ఆపలేదు. తనను చూసి ఎట్రాక్ట్ అయ్యి తన దగ్గరకి వచ్చిన కొందరికి శిక్షణ ఇచ్చి, సాధారణంగా చేత్తో చేసే పనిని ఒక ప్రత్యేక సేవగా మార్చాడు.అతి కొద్ది సమయంలోనే షెన్జెన్ నగరంలోని బావోన్ జిల్లాలో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ఈ కుర్రాడు… ఆ తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరొక బ్రాంచ్. ఆ తర్వాత మరో బ్రాంచ్ ఇలా విస్తరించుకుంటూ పోయాడు.
ఇవి కూడా చదవండి
గంట పాటు గోకించుకోవడానికి రూ.4,200!
అతని దగ్గరకి వచ్చే కస్టమర్లు ఒక గంట పాటు స్క్రాచింగ్ సెషన్ కోసం 300 యువాన్లు చెల్లిస్తున్నారు. భారతీయ కరెన్సీలో అది సుమారు రూ.4,200. ఇలా గోకించుకునేటప్పుడు కస్టమర్లు ప్రశాంతంగా మంచంపై పడుకుంటారు. శిక్షణ పొందిన అతని ఉద్యోగులు ప్రత్యేకంగా రూపొందించిన మొనదేలిన గోళ్లను ఉపయోగించి శరీరంలోని వివిధ ప్రాంతాలను సున్నితంగా గోకుతారు. ఎక్కడ ఎక్కువగా గోకించుకోవాలనుకుంటున్నారో కస్టమర్లే ముందుగా చెప్పే ఫెసిలిటీ కూడా ఉంది.
అయితే ఇది కేవలం దురద తీర్చుకునే సేవ మాత్రమే కాదని, దీనిని ఒకరకమైన రిలాక్సేషన్ అనుభవంగా జనం చూస్తున్నారని అంటున్నాడు. కొందరికి మసాజ్ చేసిన తర్వాత కలిగే విశ్రాంతి కంటే కూడా ఇది ఎక్కువ హాయిగా అనిపిస్తోందట.
ఇదంతా కేవలం కామెంట్ వల్లే…
ఇంత పెద్ద బిజినెస్ సక్సెస్ కు అసలు కారణం గోకడం కాదు. ప్రజలు సరదాగా చేసిన మాట వెనుక ఉన్న ఒక చిన్న అవసరాన్ని జాంగ్ గుర్తించడి దానికి పరిష్కారం వెతికటమే.
ఈ రోజుల్లో సిటీల్లో బ్రతికే చాలామంది తీవ్రమైన ఒత్తిడితో ఉంటున్నారు.రోజూ వారి పని, ట్రాఫిక్, ఆర్థిక సమస్యలు, డిజిటల్ జీవితంతో అలసిపోయిన వారికి చిన్నపాటి రిలాక్సేషన్ కూడా ఇప్పుడు ఒక అవసరంగా మారుతోంది. మసాజ్, స్పా, థెరపీ వంటి సేవలకు డబ్బులు చెల్లిస్తున్న ప్రజలు, కొత్త అనుభవం కోసం స్క్రాచింగ్ సేవను కూడా ప్రయత్నిస్తున్నారు.
జాంగ్ అవుట్లెట్లకు వచ్చే వారిలో దాదాపు 70 శాతం మంది మగవాళ్లు కాగా, 30 శాతం మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అసలైన విజయం..ఒకసారి ఈ సేవను ప్రయత్నించిన వారిలో కొందరు మళ్లీ మళ్లీ రావడం కూడా ఈ బిజినెస్‌కు రావటమే.
రెండు అవుట్లెట్లు.. నెలకు రూ.14 లక్షల ఆదాయం
ప్రస్తుతం జాంగ్ నిర్వహిస్తున్న రెండు అవుట్లెట్ల ద్వారా నెలకు సుమారు 1,00,000 యువాన్ల ఆదాయం వస్తోంది. భారతీయ కరెన్సీలో అది దాదాపు రూ.14 లక్షలకు పైగా ఉంటుంది.
ఈ రెండు కేంద్రాలు ఇప్పటికే బ్రేక్-ఈవెన్ స్థాయిని చేరుకుని లాభాల్లోకి వెళ్లాయని జాంగ్ చెబుతున్నాడు. అంటే సోషల్ మీడియా కామెంట్లలో కనిపించిన ఒక చిన్న ఆలోచన ఇప్పుడు నిజమైన వ్యాపారంగా మారిపోయింది.
కాబట్టి గోకడం కూడా బిజినెస్ అని అర్దం చేసుకోండి. అలాగే సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా బిజినెస్ పెట్టడానికి ఐడియాలు ఇచ్చే సోర్స్ లు అనే తెలుసుకోండి. జై జెన్ జీ.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








