పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు నియామకం..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పార్లమెంట్‌లోని ప్రతిష్టాత్మకమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (Business Advisory Committee) సభ్యుడిగా రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేశారు. రాజ్యసభ కమిటీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్టాండింగ్ కమిటీల సభ్యుల నియామకాన్ని చేపట్టారు.
రాజ్యసభలో సభా కార్యక్రమాల నిర్వహణ, చర్చకు వచ్చే అంశాల ప్రాధాన్యత, సభా సమయాన్ని కేటాయించడం వంటి కీలక పార్లమెంటరీ వ్యవహారాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి కీలక కమిటీలో సభ్యుడిగా సానా సతీష్ బాబుకు అవకాశం లభించడం ఆంధ్రప్రదేశ్‌కు లభించిన కీలక ప్రాతినిధ్యంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సమర్థవంతంగా ప్రస్తావిస్తూ, ప్రజా సమస్యలు , అభివృద్ధి అంశాలకు మరింత ప్రాధాన్యత తీసుకురావడానికి ఈ బాధ్యత ఎంతగానో దోహదపడుతుందని ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులైన ఎంపీ సానా సతీష్ బాబుకు సహచర ఎంపీలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు , కార్యకర్తలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.








