పీవీఎన్ మాధవ్‌తో బాబుమోహన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav)తో సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ (Babu Mohan) భేటీ అయ్యారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన పలు అంశాలపై చర్చించారు. బాబూమోహన్‌కు సారథ్యం యాత్ర సంచికను మాధవ్ బహూకరించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ (Panatala Suresh), తెలంగాణ బీజేపీ నాయకుడు కట్టా సుధాకర్ (Katta Sudhakar) తదితరులున్నారు.








