ఆ రూ.40 కోట్ల ఎక్కడివి? … దస్తరిగిరిని ప్రశ్నించిన ఈడీ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ హత్య కోసం రూ.40 కోట్లు సుఫారీగా చెల్లించేలా ఒప్పందం చేసుకుని నిందితుడు షేక్ దస్తగిరి (Shaik Dastagiri)కి (అఫ్రూవర్‌గా మారారు) అడ్వాన్స్ కింద రూ. కోటి ఇచ్చారంటూ సీబీఐ (CBI) తేల్చిన నేపథ్యంలో ఆ ఆర్థిక లావాదేవీల గుట్టును ఈడీ (ED) వెలికితీస్తోంది. ఇందులో భాగంగా దస్తగిరిని ఈడీ అధికారులు హైదరాబాద్ (Hyderabad)లోని కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకూ దాదాపు 7 గంటల పాటు విచారించారు. వివేకా హత్య కోసం కుట్రదారులు వెచ్చించాలని నిర్ణయించుకున్న రూ.40 కోట్లను వారు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనుకున్నారు? అంత భారీ మొత్తం వారికి ఇచ్చేందుకు సిద్ధమైన తెర వెనుక వ్యక్తులెవరు? వారి ఆర్థిక మూలాలు ఏంటి అనే కోణంలో ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.








