గాంధీభవన్లో కాంగ్రెస్ సంబరాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీభవన్ (Gandhi Bhavan)లో ఘనంగా సంబురాలు నిర్వహించారు. షిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు సాయికుమార్ (Mettu Saikumar) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (V. Hanumantha Rao) ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు, బాణసంచా కాల్చి, బ్యాండ్ కొడూతూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకొన్నారు.








