గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Shivpratap Shukla)తో లోక్‌భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. కొండా సురేఖ (Konda Surekha)ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు సీఎం అధికారిక సమాచారం పంపించిన నేపథ్యంలో, వీరి ఇరువురి సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సురేఖ బర్తరఫ్కు కారణాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం సీఎం సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్‌భవన్ (Lok Bhavan) అధికారిక లేఖను విడుదల చేసింది.








