ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల
2026 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ (Education Department,) నుంచి 79 మంది, ఇంటర్ బోర్డు (Intermediate Board) నుంచి 24 మందిని ఎంపిక చేసింది. ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల (Principals) పేరుతో జీవో జారీ చేసింది. రాష్ట్రస్థాయి కమిటీ సిఫారస్సుల మేరకు ఈ అవార్డులను ఖరారు చేశారు. శనివారం గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం సత్కరించనుంది.








