ఆ ప్రచారం నమ్మొద్దు …మాకు ఎలాంటి సంబంధం లేదు : కొండా సురేఖ
త్వరలో బిగ్ అప్డేట్ (Big update) ఉంటుందని తాను ప్రకటించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఖండించారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతా (Facebook account)లో త్వరలో బిగ్ అప్డేట్ ఉంటుంది. వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ అంటూ ఆసక్తికర పోస్టు వైరల్ అయింది. దీనిపై కొండా సురేఖ స్పందించి సోషల్ మీడియా (Social media) వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ సోషల్ మీడియా వేదికల్లో నా పేరుతో ప్రసారమవుతున్న పోస్టులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మీడియా ప్రతినిధులు, ప్రజలు కేవలం అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నాం అని పోస్టు చేశారు.








