ట్రెడిషనల్ లుక్ లో చూడముచ్చటగా ఇస్మార్ట్ బ్యూటీ
నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్(Nabha Natesh), ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) మూవీతో ఎంతో మంది కుర్రాళ్ల మనసుల్ని దోచుకుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫాలోవర్లకు టచ్ లో ఉండే నభా, తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో నభా రస్ట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్, దానికి వర్క్ బ్లౌజ్ ధరించి, అవుట్‌ఫిట్ కు తగ్గట్టు మెడలో లేయర్డ్ గోల్డ్ నెక్లెస్, చెవులకు మెరిసే మోడల్ కమ్మలు, చేతులకు గాజులు వేసుకుని ఎంతో చూడముచ్చటగా కనిపించగా, ఈ అవుట్‌ఫిట్ లో నభా మరింత అందంగా ఉందని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








