నాని నుంచి నేర్చుకుంటున్న కయాదు..
నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న భారీ మూవీ ది ప్యారడైజ్(The Paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే జడల్ పాత్రలో నాని కొత్త లుక్, తాజాగా రిలీజైన యేషనాగుల(Yeshanagula) సాంగ్ సోషల్ మీడియాలో మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో కయాదు లోహర్(Kayadhu Lohar) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసినా, ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ఇప్పటివరకు రహస్యంగానే ఉంచింది. దీంతో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజాగా ఓ సందర్భంలో ది ప్యారడైజ్ పై, నానితో కలిసి పనిచేసిన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ పై కయాదు మాట్లాడింది. ఈ ప్రాజెక్ట్‌ను ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా, నేర్చుకునే అవకాశంగా కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాని నటించే విధానం, కెమెరా రోల్ అయ్యాక నాని క్యారెక్టర్ లోకి వెళ్లే తీరు, ఆయన వర్కింగ్ స్టైల్‌ను దగ్గరగా గమనిస్తూ అనుభవాన్ని పొందాలని ఆమె ఆసక్తి చూపుతోంది.
నాని గురించి మాట్లాడుతూ ఆయనతో వర్క్ చేయడం ఎంతో సులభమని, సూపర్‌స్టార్‌తో పనిచేస్తున్నాననే భావన కలగదని కయాదు ప్రశంసించింది. దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను ఎస్ఎల్వీ సినిమాస్(SLV Cinemas) నిర్మిస్తోంది. మోహన్ బాబు(Mohan babu), సోనాలి కులకర్ణి(Sonali Kulakarni), రాఘవ్ జుయాల్(Raghav Juyal) ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.








