“రోమాంచకం” ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ, సినిమా చూస్తున్నంత సేపు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు – సుమంత్ ప్రభాస్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా ఈ నెల 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్.
– మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు.
– తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది.
– ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది.
– రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా డైరెక్టర్ వేణుగోపాల్ గారు ఆయనకు ఈ క్యారెక్టర్ కు ఎలా ఉండాలో అలా మార్చుకునేందుకు ఆర్నెళ్లు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ లో ఎలా నటించాలి అనేది నాకు ఐడియా ఉంది. కానీ వర్క్ షాప్స్ తో షార్ప్ అయ్యాను. వర్క్ షాప్స్ అంతా కంప్లీట్ అయ్యాక మొదటి నుంచి చివరి దాకా నా పర్ ఫార్మ్ చూసుకుంటే ఎంతో మార్పు కనిపించింది. కొన్నిసార్లు ఒకే సీన్ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి.
– సందీప్ అన్న ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలిసి ఒక క్యూట్ స్టోరీ ఉంది నువ్వు విను అన్నారు. ఆయన చెప్పాడంటే తప్పకుండా బాగుంటుందని కథ విన్నాను. వేణు అన్న చెప్పిన నెరేషన్ రెండున్నర గంటలు ఎంజాయ్ చేశాను.సందీప్ అన్న, ప్రణయ్ అన్న బయటకు అలా కనిపిస్తారు కానీ వాళ్లు చాలా స్వీట్ పర్సన్స్. వాళ్లతో ట్రావెల్ అయిన వాళ్లకు తెలుస్తుంది.
– విజయ్ దేవరకొండ అన్న మా మూవీ ప్రీ రిలీజ్ కు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా గురించి బాగా మాట్లాడటం కూడా సంతోషాన్నిచ్చింది. విజయ్ అన్నను చూసి నేను చాలా ఇన్స్ పైర్ అవుతుంటాను. రోమాంచకం సినిమా ఫస్ట్ కాపీ చూసి సందీప్ అన్న బాగా పర్ ఫార్మ్ చేశావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. రోమాంచకం టైటిల్ కొత్తగా ఉంది ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా అనిపించింది. కానీ ఇప్పుడు అదొక ఊతపదంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ పదం వాడుకలోకి వస్తుందని నమ్ముతున్నా.
– అనంతిక టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమెకు చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసు. ఏ విద్యనైనా తక్కువ టైమ్ లో నేర్చుకుంటుంది. ఆమెతో ఈ మూవీలో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది. మా సినిమా ఆద్యంతం రోమాంచకం ఫీల్ ను ప్రేక్షకులకు కలిగిస్తుంటుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ చూస్తారు. ప్రతి సీన్ మీకు నవ్వు తెప్పిస్తుంది. నాకు సినిమా చూసినంత సేపు మజా వచ్చింది. మా మూవీలో వాసుకి వైభవ్ మ్యూజిక్ ఇరగదీశాడు. రాధారమణ నా ఫేవరేట్ సాంగ్. ఇంకో లవ్ సాంగ్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు.
– హీరోగా అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ వస్తున్నాయి. హీరోగా పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. నెక్ట్స్ ఏషియన్ బ్యానర్ లో రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటితో ఒక మూవీ చేయబోతున్నా. ఈ నెలలోనే ఆ మూవీ స్టార్ట్ కానుంది.








